»   » ధనుష్ మూవీ ‘రాంఝానా’పై పాక్‌లో నిషేదం

ధనుష్ మూవీ ‘రాంఝానా’పై పాక్‌లో నిషేదం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : ధనుష్, సోనమ్ కపూర్ కాంబినేషన్ లో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ రూపొందించిన చిత్రం 'రాంఝానా'. ఈ చిత్రం ఓ హిందు కుర్రవాడికి, ముస్లిం అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ వ్యవహారం చుట్టూ తిరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా...ఈచిత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు 'రాంఝానా' ప్రదర్శనను అడ్డుకుంది. పాక్‌లో ఎక్కడ కూడా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

చిత్రంలో జోయా హైదర్‌ అనే ముస్లిమ్‌ యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇందులో జోయా హైదర్ తండ్రి ఓ ప్రొఫెసర్‌. తండ్రికి కూతురంటే ఎంతో ప్రేమ. మతం కట్టుబాట్లను పక్కన పెట్టి కూతురుకు పూర్తి స్వేచ్ఛని ఇస్తాడు. ఈ క్రమంలో జోయా హైదర్ ఓ బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలోపడుతుంది. ఆ తరవాత కథ ఎలా ముందుకు సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

మస్లిం అమ్మాయిన హిందూ అబ్బాయిని ప్రేమించడం అనే అంశం ఉన్నందు వల్లనే ఈ చిత్రాన్ని పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేదించింది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఇలాంటి చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సల్మాన్ ఖన్ 'ఏక్ థా టైగర్', సైఫ్ అలీ ఖాన్ 'ఏజెంట్ వినోద్' లాంటి చిత్రాలను కూడా పాకిస్థాన్ బోర్డు నిషేదించిన సంగతి తెలిసిందే.

English summary
Bollywood movie Raanjhanaa has been banned by the Central Board of Film Censors in Pakistan shortly before its scheduled release, for its ‘controversial plot’. Previously, the Censor Board also banned films including Ek Tha Tiger, G.I Joe and Agent Vinod for “anti-Pakistan” sentiments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu