twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బస్‌స్టాప్‌' వివాదంపై సెన్సార్ స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో దర్శకుడి తాజా చిత్రం 'బస్‌స్టాప్‌' ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ద్వంద్వార్థాలు వచ్చేలా సంభాషణలున్న'బస్‌స్టాప్‌' సినిమాను నిలిపి వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సినిమా కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం కాదని ఆరోపించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ గేటు ముందు సెన్సార్‌ బోర్డు దిష్టిబొమ్మ దహనం చేశారు.

    ఈ నేపధ్యంలో సెన్సార్‌ బోర్డు సభ్యురాలు సునీతచౌదరి స్పందిస్తూ... ఇది 'ఎ' సర్టిఫికేట్‌ చిత్రం. యూ, యూబైఎ అని ఇవ్వలేదే. కొందరు కావాలని సినిమాను అడ్డుకుంటున్నారు. ఈ సినిమాను నేనే సెన్సార్‌ చేశాను. పెద్దవారు కూడా చూసి ఆనందపడాలి కదా అని వివరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశిలు మాట్లాడుతూ... సినిమాలో విపరీతమైన ద్వంద్వార్థాలు ఉన్నప్పటికీ సెన్సార్‌ చేయడంలో విఫలమైన బోర్డును రద్దు చేయాలని కోరారు. అనంతరం వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

    వివాదం ఎలా ఉన్నా...సినిమా ఓపినింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఢమురకం చిత్రం విడుదల కావాల్సిన ధియోటర్స్ లో ఈ చిత్రం విడుదలై మొదటిరోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. చిత్రంకు విడుదల చేసిన ప్రోమోలు ఆసక్తి రేపటం, చిత్రం సెన్సార్ వద్ద 40 పై చిలుకు కట్స్ పడాల్సినవి పడలేదని వార్తలు రావటం,ఈ రోజుల్లో చిత్రం దర్శకుడి చిత్రం కావటం కలిసివచ్చింది. దీపావళికి స్టైయిట్ తెలుగు చిత్రాలు మరేమీ లేకపోవటం కూడా ఈ సినిమాకు మరింతగా కలిసి వస్తుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.

    ప్రిన్స్‌, శ్రీదివ్య, సాయికుమార్‌ పంపన, ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. హాసిక, గోపాల్‌సాయి, రావు రమేష్‌, శ్రీను, డి.ఎం.కె, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి. డ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాత: బి. మహేంద్రబాబు. ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, కొరియోగ్రఫీ: రఘు, సతీశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

    English summary
    
 DYFI activists and SFI people have protested at RTC cross roads to ban this film 'Bus Stop'. They say that this film is abusing woman and showing parents in a poor light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X