‘సెన్సార్’ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు.. శరణం గచ్చామీ చూస్తున్న అధికారులు..
సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదాస్పదమైన ‘శరణం గచ్చామి’ సినిమాను సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం వీక్షించారు.
సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదాస్పదమైన 'శరణం గచ్చామి' సినిమాను సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం వీక్షించారు. ఈ సందర్భంగా మాసాబ్ ట్యాన్ క్ సెన్సార్ కార్యాలయం వద్ద భారీ పొలీస్ బలగాల మోహరించారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

రిజర్వేషన్ల కథాంశంతో తెరకెక్కిన 'శరణం గచ్చామి' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడంతో ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా జేఏసీ సభ్యులు హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ వద్ద నున్న సెన్సార్ బోర్డు ఆఫీస్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

sharanam gachchami movie censor central screening committee prem raj censor board శరణం గచ్చామి సెన్సార్ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ ప్రేమ్ రాజ్ సెన్సార్ బోర్డు


Click it and Unblock the Notifications