»   »  హిట్ కోసం స్టార్ రైటర్ సాయిమాధవ్ మళ్లీ.. డిఫరెంట్‌గా

హిట్ కోసం స్టార్ రైటర్ సాయిమాధవ్ మళ్లీ.. డిఫరెంట్‌గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కంచె, ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలతో సాయి మాధవ్ బుర్రా టాలీవుడ్‌లో స్టార్ రైటర్‌గా మారారు. తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ చిత్రానికి సాయి మాధవ్ కలానికి మరోసారి పదును పెట్టాడు. యంగ్ హీరో రాజ్ తరుణ మరో విభిన్నమైన కామెటీ చిత్రంతో ముందుకొస్తున్నాడు. వీరిద్దరూ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో మళ్లీ హిట్ కొడ్తారా అనేది వేచిచూడాల్సిందే.

 ‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'కు సెన్సార్ పూర్తి

‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'కు సెన్సార్ పూర్తి

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.


 మార్చి 3న గ్రాండ్‌గా విడుదల

మార్చి 3న గ్రాండ్‌గా విడుదల


నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ - ``2016లో హిట్ అయిన చిత్రాల్లో ‘ఈడోర‌కం-ఆడోర‌కం' త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'. హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం.


 డిఫరెంట్ పాత్రలో హీరో రాజ్ తరుణ్

డిఫరెంట్ పాత్రలో హీరో రాజ్ తరుణ్


హీరో రాజ్ త‌రుణ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించాడు. అనేక మ‌లుపుల‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా ట్రైల‌ర్‌తో పాటు పాట‌ల‌ను కూడా రిలీజ్ చేశాం. హంస‌నందిని న‌టించిన స్పెష‌ల్ సాంగ్ `నా పేరే సింగ‌పూర్ సిరిమ‌ల్లి..` సాంగ్‌ను నిన్న‌నే రిలీజ్ చేశాం. ప్ర‌తి పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో ముందు వ‌రుస‌లో నిలుచుకుంది.


 సరికొత్తగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్

సరికొత్తగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్


ఈ చిత్రం టీజర్‌లోని డైలాగ్స్ సరికొత్తగా వినిపించాయి. సాయిమాధ‌వ్‌గారి సంభాష‌ణ‌లు ట్రైలర్‌లోనే విపరీతంగా నవ్వు తెప్పించాయి. ఓ హాస్య చిత్రానికి సంభాషణలు సమకూర్చడం ఇదే తొలిసారి. ఇక ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించగా, ఎం.ఆర్‌.వ‌ర్మ ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు ప్ల‌స్ కానున్నాయి. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.


 విలన్‌గా సల్మాన్ సోదరుడు అర్భాజ్

విలన్‌గా సల్మాన్ సోదరుడు అర్భాజ్


బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టించారు అని నిర్మాత రామబ్రహ్మం సుంకర అన్నారు. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన హావభావాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. నాగ‌బాబు, పృథ్వీ, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థ శ్రీకాంత్ విస్సా అందించారు. అనూప్ రూబెన్స్‌ సంగీతం అందించిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌కు వంశీకృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం వహించారు.


English summary
Kittu Unnadu jagratta movie ready for release on march 3. star writer sai madhav burra pens this movie. This movie made on hilarious comedy script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu