»   » స్వలింగ సంపర్క వ్యతిరేకం కాదట... ఇంతకీ "మిస్ యూ" వీడియోలో ఏముంది (వీడియో)

స్వలింగ సంపర్క వ్యతిరేకం కాదట... ఇంతకీ "మిస్ యూ" వీడియోలో ఏముంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పంకజ్ నిహ్లానీ.. సెన్సార్ బోర్డు కు చైర్మన్ లుగా వ్యవహరించిన వాళ్లలో మరెవరి పేరూ ఇంతలా మీడియాలో నానలేదేమో! బహుశా ఈయన తప్ప ఇన్ని వివాదాలను సృష్టించిన సీబీఎఫ్ సీ బోర్డు చైర్మన్ మరొకరు లేకపోవచ్చు. ఉడ్తా పంజాబ్ సినిమా విషయం లో దేశంలో కొత్త రాజకీయ పోరాటానికే తెర తీశాడు నిహ్లానీ.

ఆ సమయం లో ఇండియన్ సినిమా కి ఒక విలన్ గా మారిపోయారు. కొన్ని నెలల క్రితం 'ఉడ్తా పంజాబ్' పట్ల నిహ్లానీ అనుసరించిన వైఖరి దేశవ్యాప్తంగా చర్చా వస్తువుగా మారిపోయింది. అడల్ట్ కంటెంట్ పట్ల చాలా నిక్కచ్చిగా ఉండే ఆయన షరీఫ్ డి రగ్నేకర్ రూపొందించిన 'మిస్ యు' అనే స్వలింగ సంపర్కుల గూర్చిన మ్యూజిక్ వీడియోకు లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిహలానీ ఈ వీడియోకు అనుమతి ఇవ్వడమే తాజాగా చర్చనీయాంశమైంది.

 ఇద్దరు యువకుల ప్రేమ:

ఇద్దరు యువకుల ప్రేమ:


'మిస్ యు' వీడియోలో ఇద్దరు యువకుల ప్రేమ, ఘర్షణ, విడిపోవడం, ఒకరినొకరు కోల్పోతున్నామన్న భావనలను పొందుపరిచారు. దీనికి బోర్డు 'ఏ' సర్టిఫికేట్ కట్టబెట్టి విడుదలకు ఆమోదముద్రవేసింది. ఈ వీడియోకు అడల్డ్ కేటగిరీ పత్రం ఇవ్వడంపై నిహలానీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.

 స్వలింగ ప్రేమలకు సంబంధించిన వీడియో:

స్వలింగ ప్రేమలకు సంబంధించిన వీడియో:


సెన్సార్ బోర్డు గే కమ్యూనిటీకి వ్యతిరేకా? అనే అనుమానాలు ముసురుకుంటున్న తరుణంలో నిహలానీ వివరణ ఇచ్చారు. తమకున్న నిబంధనలకు అనుగుణంగా దృశ్యాలు ఉంటే స్వలింగ ప్రేమలకు సంబంధించిన వీడియోలకు అనుమతి ఇవ్వడంలో తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.

 రెండు వారాల క్రితమే:

రెండు వారాల క్రితమే:


స్త్రీ-పురుషుల రొమాంటిక్, శృంగార సన్నివేశాల పట్ల ఎలాంటి నియమావళి పాటిస్తామో ఇలాంటి సీన్స్ కూ ఆ రూల్సే అనుసరిస్తామని చెప్పుకొచ్చారు.'మిస్ యు' పాటలో ఒక సన్నివేశాన్ని తొలగించి రెండు వారాల క్రితమే అనుమతి ఇచ్చేశామని నిహ్లానీ చెప్పారు.

 మళ్లీ తెరపైకి తెచ్చి:

మళ్లీ తెరపైకి తెచ్చి:


ఎప్పుడో జరిగిన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి వివాదాస్పదం చేయడం తగదని అన్నారు. తమ చిత్రానికి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఇటీవలిగా ఫిల్మ్ మేకర్స్ సెన్సార్ బోర్డును విమర్శిస్తున్నారని, అలా చేయడం ద్వారా తమ సినిమాకేమీ కలిసిరాదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ స్టేట్ మెంట్ ద్వారా తన విమర్శకులపై అసంతృప్తి వెళ్లగక్కారు నిహ్లానీ.

అధికారమే లేదనీ

అధికారమే లేదనీ


అప్పట్లో ఉడ్తా పంజాబ్ అనే సినిమా విషయం లో రేగిన దుమారం ఒక్కసారి భారతీయ సెన్సార్ బోర్డ్ ని రచ్చకీడ్చింది. అసలు సెన్సార్ బోర్డ్ కి సెన్సార్ చేసే అధికారమే లేదనీ కేవలం సినిమా గ్రేడ్ని మాత్రమే నిర్ణయించాలనీ తెగేసి చెప్పింది హైకోర్టు.

విమర్షలు మొదలయ్యాయి:

విమర్షలు మొదలయ్యాయి:

సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి, వాటిని సెన్సార్ చేసే అధికారం బోర్డుకు లేదని హైకోర్టు వెల్లడించింది. సినిమాలో ఎక్కువ శాతం సీన్లను కట్ చేస్తే, ఇక సినిమాలో కథాంశం ఏముంటుందని ప్రశ్నించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమే సెన్సార్ బోర్డు పని అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దాంతో పంకజ్ నిహ్లానీ విలన్ అయిపోయాడు. సెన్సార్ బోర్డ్ చీఫ్ గా ఉన్న పంకజ్ సినిమాలని అడ్డుకుంటున్నారనీ విమర్షలు మొదలయ్యాయి.

 ఏకంగా 89 కత్తెర్లు :

ఏకంగా 89 కత్తెర్లు :


మాదక ద్రవ్యాలకు బానిసైన పంజాబ్‌కు చెందిన ఓ రాక్‌స్టార్ ఇతివృత్తంగా తీసిన ఈ సినిమాకు ధ్రువీకరణ పత్రం జారీకి సెన్సార్‌ బోర్డు ఏకంగా 89 కత్తెర్లు వేసింది. అయితే ఇందులో అసభ్యకర పదాలు ఎక్కువగా వాడారని, ప్రముఖుల పేర్లను సినిమాలో జంతువులకు పెట్టారని, సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పైగా చిత్ర టైటిల్ పంజాబ్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించింది.

 ఆరోపణలు చేశాడు:

ఆరోపణలు చేశాడు:


సీబీఎఫ్ సీ తీరును నిరసిస్తున్న సినిమా వాళ్లకు ఆమ్ ఆద్మీ పార్టీ లంచాలు ఇస్తోందని నిహ్లానీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ విషయంలో నిహ్లానీ ఈ ఆరోపణలు చేశాడు. దీనిపై గయ్యి మన్నారు సినిమా వాళ్లంతా.

 రాజకీయాలు మాట్లాడాడు :

రాజకీయాలు మాట్లాడాడు :


ఈ వ్యవహారంపై ఇప్పటికే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లు స్పందించారు. ఉడ్తా పంజాబ్ పై సెన్సారువేటు సమంజసం కాదని వారు వ్యాఖ్యానించారు. దీంతో నిహ్లానీ ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ కుట్ర అని వ్యాఖ్యానించాడు. మరి నిహ్లానీకి రాజకీయ సరదా చాలా ఉనట్టే ఉంది. సినిమా వాళ్లపై సూటిగా స్పందించకుండా... రాజకీయాలు మాట్లాడాడు

 సర్టిఫికెట్లు మాత్రమే:

సర్టిఫికెట్లు మాత్రమే:


సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి, వాటిని సెన్సార్ చేసే అధికారం బోర్డుకు లేదని హైకోర్టు వెల్లడించింది. సినిమాలో ఎక్కువ శాతం సీన్లను కట్ చేస్తే, ఇక సినిమాలో కథాంశం ఏముంటుందని ప్రశ్నించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమే సెన్సార్ బోర్డు పని అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 13 కట్స్‌తో ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

 ఇద్దరు స్వలింగ సంపర్కులు:

ఇద్దరు స్వలింగ సంపర్కులు:


షరీఫ్ డీ రగ్నేకర్ రాసి పాడిన "మిస్ యూ" అనే ఈ మ్యూజిక్ వీడియో లో ఇద్దరు స్వలింగ సంపర్కుల మనోవేదన కనిపిస్తుంది. మగవాడు ఆడదాన్నే పెళ్ళిచేసుకోవాలనే నిబందనా, గే లను చిన్న చూపు చూసే సమాజాన్ని ప్రశ్నిస్తూ తీసిన ఈ వీడియోని కేవలం ఒకే ఒక కట్ చెప్పి, ఏ సర్టిఫికెట్ తో పబ్లిష్ చేయటానికి అనుమతిచ్చారు.click

English summary
Central Board of Film Certification (CBFC) chief Pahlaj Nihalani said that the censor board is not homophobic. Nihalani made these comments after awarding an A certificate to a newly-released gay music video, Miss You, by Sharif D Rangnekar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu