»   »  బాహుబలి సినిమాపై సెంథిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బాహుబలి సినిమాపై సెంథిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' మూవీ ఇండియా వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ గ్రాఫిక్స్ అందించిన సినిమా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాను తన కెమెరాలో అద్భుతంగా బంధించిన ఘనత డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సెంథిల్ కుమార్ కే దక్కుతుంది.

అయితే బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అద్భుతం అని పొగిడినప్పటికీ.... కొన్ని సీన్లలో రియాల్టీ లోపించిందని విమర్శించారు. సెంథిల్ కుమార్ కూడా ఇదే విసయం నొక్కివక్కానించారు.‘బాహుబలి' సినిమాలోని చాలా విషయాల్లో తాను సంతృప్తితో లేనని అంటున్నారు.

ఇటీవల ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ...‘డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా.... బాహుబలి సినిమాలోని చాలా విషయాల్లో డిసప్పాయింట్ అయ్యాను. విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి చాలా సీన్లలో మిస్టేక్స్ జరిగాయి. వాటి వల్ల గ్రాఫిక్స్‌కి ఫేక్ లుక్ వచ్చింది అన్నారు. బాహుబలి 2 విషయంలో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుడండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సెంథిల్ కుమార్ తెలిపారు.

CGI Made Baahubali Look Fake: KK Senthil

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2' షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.

యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు. 2016 సంవత్సరం మొత్తం ‘బాహుబలి-2' షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు.

‘బాహుబలి-1' భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో రాజమౌళి రెండో పార్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి 1 కంటే రెండో పార్టు కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. సెకండ్ పార్టులో కొన్ని అడిషనల్ క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. సౌత్ తో పాటు బాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

‘బాహుబలి-2'ను 2016లో విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం గతంలో ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే ఏడాది సినిమా రావడం లేదని తేలి పోయింది. ‘బాహుబలి-2' విడుదల సాధ్యమయ్యేది కేవలం 2017లోనే అంటున్నారు ఆచిత్ర యూనిట్ సభ్యులు.

English summary
Senthil said, 'as a DOP, I am disappointed by a lot of things in 'Baahubali'. There are so many scenes where there were keying mistakes, which made the CGI look fake. There were issues related to the depth of field, there are motion blurs."
Please Wait while comments are loading...