»   » "ఔను..! ఆ రిలేషన్స్ గురించి చైతూ కి తెలుసు" చాలా బోల్డ్ గా చెప్పేసిన సమంతా

"ఔను..! ఆ రిలేషన్స్ గురించి చైతూ కి తెలుసు" చాలా బోల్డ్ గా చెప్పేసిన సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగం లో నటీ నటుల ప్రేమలూ, బ్రేక్ అప్ లూ సర్వసాధారణం. మామూలు మనుషుల జీవితాల్లోనూ ఇలాంటి స్టోరీలే ఉన్నా కూడా సినీ సెలబ్రిటీలు అనగానే ఈ తరహా విషయాలు ప్రాధాన్యతని సంతరించుకుంటాయి తీరా వారి పెళ్ళి సమయం లోనో, కొత్త రిలేషన్ సంధర్భం లోనో ఈ సంఘటనలు మళ్ళీ తెర ంకీదకి వస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో ఈ డిస్క‌ష‌న్స్ ఎక్కువ న‌డుస్తుంటాయి.

కానీ వాటి గురించి ఓపెన్ గా ఎవ‌రూ మాట్లాడ‌రు. హీరోయిన్లు కూడా ఎక్క‌డా దాని ప్ర‌స్తావ‌న తీసుకురారు. మీడియాకు ఇంట‌ర్వ్యూలిచ్చినా ఇలాంటి ప్ర‌శ్న‌లు అవాయిడ్ చేస్తారు. కానీ స‌మంత మాత్రం ఇందుకు మిన‌హాయింపు అని చెప్పాలి. స‌మంత ఒక‌ప్పుడు సిద్ధార్థ్ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఐతే తాజాగా సౌత్ స్కోప్ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సిద్ధూ పేరెత్త‌కుండా అత‌డితో రిలేష‌న్ షిప్ గురించి ఓపెన్ గానే చెప్పేసింది స‌మంత‌. త‌న గురించి చైతూకు.. చైతూ గురించి త‌న‌కు పూర్తిగా తెలుస‌ని చెబుతూ ఈ వ్యాఖ్య‌లు చేసిందామె. ఇంతకీ ఆ సంగతేమిటంటే...

 సిదార్థ్‌.. సమంతా.. :

సిదార్థ్‌.. సమంతా.. :

సిదార్థ్‌.. సమంతా.. ఒకప్పుడు ప్రేమ పక్షుల్లా తిరిగారు.. ఘాటు ఘాటుగా ప్రేమించుకున్నారు. ‘నీకు నేను.. నాకు నువ్వు..ఒకరికొకరం నువ్వు నేను' అంటూ ప్రేమలో మునిగితేలారు. ఇక సన్నాయి బాజాలే మోగ్రడం ఆలస్యం అనుకునేతంలో.. వారి ప్రేమ పెటాకులైంది. ఇద్దరూ పరిణతి చెందిన వ్యక్తులు కావడంతో ప్రేమ వైఫల్యం తర్వాత కూడా తమ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.

 సిద్దార్థ్‌-సమంతలు ప్రేమలో:

సిద్దార్థ్‌-సమంతలు ప్రేమలో:


నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘జబర్దస్త్' షూటింగ్ సమయంలో సిద్దార్థ్‌-సమంతలు ప్రేమలో పడ్డారు. వివిధ ఇంటర్వ్యూల్లో డైరక్ట్ గా పేరు చెప్పకుండా తమ జీవితంలోని స్పెషల్ పర్సన్స్‌ గురించి సిదార్థ్, సమంతలు ఒకరిగురించి మరొకరు పరోక్షంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, వీరి పెళ్లి జరగడం ఖాయమని అందరూ భావించారు.

 కారణం ఎవరికీ తెలియదు:

కారణం ఎవరికీ తెలియదు:


దీనికి తగ్గట్టే దోష నివారణకు ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలు కూడా చేశారు. అంతగా ప్రేమించుకున్న ఈ జంట.. ఒక్కసారిగా ఎందుకు విడిపోయిందో కారణం ఎవరికీ తెలియదు. రకరకాల ఊహా గానాలు వినిపించినా ఇప్పటివరకూ ఆ విషయం లో అటు సిద్దార్థ్‌ గానీ, ఇటు సమత గానీ నోరు మెదపలేది. నిజానికి అప్పటికే సిద్దార్థ్ ఒక పెళ్ళి చేసుకొని ఆమె తో విడిపోయాడు, ఆ తర్వాత శృతీ హస్దన్ తోనూ ఎఫైర్ నడిచింది ఆ తర్వాత్ సమంత పేరు అతనితో కలిపి వినిపించింది.

 పెద్ద దుమారమే

పెద్ద దుమారమే


అంతే కాదు కొన్నాళ్ల క్రితం ట్విట్టర్ సాక్షి గా ఇద్దరూ పోట్లాడుకున్నారు కూడా. అప్పట్లో ఈ ప్రేమ వ్యవహారం టాలీవుడ్, కోలీవుడ్ లలో పెద్ద దుమారమే రేపింది. ఒకరోజున ఉన్నట్టుండీ ట్విట్టర్లో.. ‘నీ జీవితంలో అత్యంత ‘చెడు' అని నీవు భావించిన సంఘటన.. వాస్తవానికి నీ జీవితంలో జరిగిన అతి మంచి సంఘటన అని నువ్వు తెలుసుకున్నప్పడు మనసు ప్రశాంతంగా ఉంటుంది' అని వ్యాఖ్యానించాడు. సిద్దార్థ్. ఈ విశయం వీళ్ళిద్దరిదా కాద అని అంతా నుకుంటున్న సమయం లోనే వెంటనే తన ట్వీట్ తో సమాధానం ఇచ్చింది సమంతా.

 కెరీర్ పాడుచేసుకోడం ఇష్టం లేక

కెరీర్ పాడుచేసుకోడం ఇష్టం లేక


దీనికి కౌంటర్‌గా సమంతా వెంటనే.. ‘నాకు పరిచయమైన అనేక మంది వ్యక్తుల్లో నువ్వు కూడా జస్ట్‌ ఒకడివి మాత్రమే అని నేను అర్థం చేసుకున్నప్పుడు నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది' అనే అర్థంలో రిప్లై ఇచ్చింది. ("That moment when I realise you're just somebody that I used to know.") దీంతో, వీరిద్దరి వ్యవహారం ఒక్కసారిగా దక్షిణాది సినీ ప్రముఖుల్లో చర్చకు దారి తీసింది. అయితే, ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ.. ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే సమంతా తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.
సినిమాల్లో మంచి పోసిషన్ లో ఉన్న టైములో ప్రేమ పెళ్లి అంటూ కెరీర్ పాడుచేసుకోడం ఇష్టం లేక సమంతా ఇంకా 3 ఇయర్స్ దాకా పెళ్లి మాట లేదని చెప్పేసింది.

సమంతా ఇంట్లో ఇష్టం లేదట

సమంతా ఇంట్లో ఇష్టం లేదట

అయతే ఈ నిర్ణయం వెనుక సమంతా కుటుంబం కూడా ఉందనీ, ముందే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్న హీరో ని పెళ్లి చేసుకోడం ముందునించే సమంతా ఇంట్లో ఇష్టం లేదట , సమంతకి రెండు గంటలు క్లాస్ కూడా పికేయ్యడంతో ఇప్పుడు సిద్దార్థ్ తో జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసిందనీ. ఇలా షాక్ ఇచ్చిన సమంతా మాటలకి ఎం సమాధానం ఇవ్వాలో కూడా అర్ధం కాకా సిద్దార్థ్ మౌనంగా ఉంటున్నాడంటూ అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి. ఇక కొన్నాళ్ళకు ఆ సంగతి అంతా మర్చి పోయారు..

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని

ఆతర్వాత సమంతా నాగచైతన్య దగ్గరవటం.., వారి మధ్య ప్రేమ పుట్టటం ఈ అక్కినేని యంగ్ స్టార్ వార్తలు హల్ చల్ చేసాయిత్వరలో హీరోయిన్ సమంతను పెళ్లాడబోవటం అంతా తెలిసిందే. చాలా ఏళ్లుగా ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇంట్లో వాళ్లని ఒప్పించిన తర్వాతగానీ... విషయం మీడియా వరకు రాలేదు. చాలా లేట్ గా ఈ విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల పాటు నాగార్జున అంగీకరించలేదూ అని వినిపించినా... తర్వాత అది కూడా నిజం కాదనీ వీరి పెళ్ళికి లైన్ క్లియర్ గానే ఉందనీ అర్థమైపోయింది.

 ఒక ఇంటర్వ్యూలో:

ఒక ఇంటర్వ్యూలో:


మొత్తానికి సమంతా నాగ చైతన్యా ఒకటవబోతున్నారు. అయితే ఈ నేపథ్యం లో ఒక ఇంటర్వ్యూలో. సమంత పాత వ్యవహారం మీద అడిగిన ప్రశ్నకు ఎవరూ ఉహించని విధంగా సమాధానం చెప్పింది. నాగ చైతన్య కీ తనకూ మధ్య ఉన్న బందం ఎంత బలమైనోకూడా ఈ విధంగా చెప్పింది సమంతా. ఇంతకీ సామ్ ఏం చెప్పిందీ నటే...

 సుత్తి లేకుండా చెప్పింది

సుత్తి లేకుండా చెప్పింది


"కొన్నేళ్లుగా చైతూ నా జీవితానికి సంబంధించిన ప్ర‌తి ముఖ్య‌మైన సంద‌ర్భంలోనూ తోడుగా ఉన్నాడు. నా వ్య‌క్తిగ‌త.. వృత్తిగ‌త జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైన సంద‌ర్భాల‌న్నింట్లో అత‌ను అండ‌గా నిలిచాడు. వేరే వ్య‌క్తుల‌తో నా బంధాలు సాగిన‌పుడు అత‌ను నాతో ఉన్నాడు. అలాగే అత‌ను వేరే వ్య‌క్తుల‌తో రిలేష‌న్ షిప్స్ లో ఉన్న‌పుడు నేను అత‌డి ప‌క్క‌నున్నాను. కాబ‌ట్టి మా ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఇంకొక‌రికి తెలియ‌ని విష‌య‌మంటూ ఏమీ లేదు'' అని స‌మంత సూటిగా.. సుత్తి లేకుండా చెప్పింది.

English summary
Samantha said that her beau Chaitanya knows everything about her past relationship. "For the last few years, me and Chay have been traveling together as good friends and we were there for each other even though we were in a relationship with others," said samantha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu