For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బు కోసం వేధిస్తున్నారు: చక్రి భార్య శ్రావణి ఫిర్యాదు

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సంగీత దర్శకుడు చక్రి మరణం అందరినీ కలిచి వేసింది. అయితే ఆయన పెద్ద కర్మ కూడా పూర్తి కాక ముందు కుటుంబ సభ్యులు ఆర్థిక తగాదాలకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చక్రి సతీమణి శ్రావణి తనను అత్తింటి వారు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ విషయంలో మీడియాలో హైలెట్ కావడంతో....కుటుంబం పరువు పోతుందని భావించిన వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్ద గొడవలు ఏమీ లేదు..చిన్న చిన్న మరనస్పర్థలు, అంతా సర్దుకున్నాయి అంటూ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు.

  అయితే ఈ రోజు మళ్లీ చక్రి భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు కోసం చక్రి తరుపు వారు నన్ను వేధిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబంలోని ఏడుగురిపై కేసు నమోదు చేసారు. చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా తనకు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

  Chakris wife Sravani alleges harassment by in laws

  గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో...

  చక్రి ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం సంగీత ప్రియులను, అభిమానులను తీవ్రమైన మనోవేదనకు గురి చేసింది. ఆయన మరణంతో ఆయన భార్య శ్రావణి ఒంటరిదయిపోయింది. చక్రిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రావణి చక్రి మరణంతో కుంగి పోయింది. ఓ ఇంటర్వ్యూలో చక్రి గురించి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చక్రి లేని జీవితం వృధా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. చక్రి మరణానికి ముందు రోజు జరిగిన పరిణామాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘ముందురోజు సాయంత్రం వరకు చక్రి ఇంటిలోనే ఉన్నారు. మా నాన్న, తమ్ముడు వస్తే కబుర్లు చెప్పారు. సాయంత్రం బయటకు వెళ్లి ఎప్పటికో వచ్చారు. నువ్వు పడుకో, నేను బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పి...కాసేపు టీవీ చూసి రాత్రి రెండుగంటల ప్రాంతంలో పడుకున్నారు' అని తెలిపారు.

  పడుకున్న తర్వాత ఆయన సాధరణంగా గురక పెడతారు. కానీ ఆరోజు గురక శబ్దం వినిపించలేదు. అనుమానం వచ్చి ఆయన వైపు చూసాను. అప్పటికే ఆయన ఒంటిరంగు మారిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు. ఒళ్లంతా చల్లబడి పోయింది. ఊపిరి ఆగి పోయింది. నా మనసు కీడు శంకించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే నా చక్రి నన్ను విడిచి వెళ్లిపోయాడనే వార్త నన్ను పిచ్చిదాన్ని చేసింది అని శ్రావణి కన్నీరుమున్నీరయ్యారు.

  ఆయన ఆరోగ్యం గురించి చాలా సార్లు హెచ్చరించాను. ఒబెసిటీతో చాలా ఇబ్బంది పడేవారు. 2010లోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. కానీ అది రిస్క్ అని చెప్పడంతో చేయించుకోలేదు. కానీ ఒబెసిటీ సమస్య తీవ్రం కావడంతో ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టారు. సర్జరీకి కూడా రెడీ అయ్యారు. అయితే కొంతకాలం ఆగాలని కార్డియాలజిస్ట్ చెప్పడంతో వాయిదా వేసారు. ఈ వారంలోనే డాక్టర్ ను కలవాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయిందని శ్రావణి కన్నీరుమున్నీరయ్యారు.

  కొంతకాలంగా కెరీర్ బాగోలేక ఇబ్బందులు పెరిగి పోయాయి. డిసెంబర్ 31న ఓ షో చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయన నా దగ్గరకు వచ్చి ‘ఈ సమయంలో మనకి ఈ షో అవకాశం రావడం ఎంత అదృష్టమో తెలుసారా, మన దగ్గర అస్సలు డబ్బు లేవు. మొత్తం అయిపోయాయి. లక్కీగా ఇపుడిది వచ్చింది' అని సంతోషంగా అన్నారు. కానీ ఉన్నట్టుండి ఈ షో క్యాన్సిల్ అయింది. ఓ సినిమా అవకాశం కూడా వచ్చినట్లే వచ్చి చేజారి పోయిందని. ఈ పరిణామాలు ఆయన్ను డిప్రెషన్ కు గురి చేసాయని తెలిపారు శ్రావణి.

  ఆయన బోలెడన్ని సినిమాలు చేసారు, చాలా సంపాదించారని అంతా అనుకుంటారు. కానీ పెద్దగా వెనకేసిందేమీ లేదు. బ్యాంకు బ్యాలెన్సులూ, ఆస్తులూ లేవు. ఉన్నదల్లా ఒక ఇల్లు మాత్రమే. తన సంపాదన ఎక్కువగా కుటుంబం కోసం, దానధర్మాలు చేసేందుకు ఖర్చుపెట్టే వారు అన్నారు శ్రావణి.

  చక్రి లేని జీవితంపై నాకు ఆసక్తి లేదు. బ్రతకాలన్న కోరిక అంతకన్నా లేదు. కానీ నేను బితికి తీరాలి. చక్రి ఒక స్టూడియో పెట్టాలనుకున్నారు. ‘సీ స్టూడియోస్' అనే పేరుని కూడా రిజిస్టర్ చేయించారు. కానీ ఆయన కలనెరవేరకుండానే వెళ్లి పోయారు. ఆయన కల నెరవేరుస్తాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చేసి తీరుతాను అన్నారు.

  English summary
  Chakris wife Sravani alleges harassment by in laws, police complaint filed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X