»   » ఊరమాస్..ఈ పెద్దపులి, అది పక్కా అంటున్నారుగా!

ఊరమాస్..ఈ పెద్దపులి, అది పక్కా అంటున్నారుగా!

Subscribe to Filmibeat Telugu

హీరో నితిన్ నటిస్తున్న నయా మూవీ చల్ మోహన్ రంగ. ఈ చిత్రం ఏప్రిల్ 5 విడుదలకు సిద్ధం అవుతోంది. నితిన్ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటిస్తున్న చిత్రం ఇది. విడుదుల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.

ఇప్పటికే విడుదలచేసిన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.తాజగా ఈ చిత్రంలో మరో పాటని పాటని విడుదల చేసారు. తెలంగాణలో బాగా పాపులర్ అయిన ఫోక్ సాంగ్ 'పెద్ద పులి' ఇందులో కాస్త మార్చి రీమిక్స్ చేసారు.వరంగల్ లోని ఓ కాలేజీ ఈవెంట్ లో ఈ సాంగ్ ని విడుదల చేయడం విశేషం. తమన్ అందించిన సంగీతం, సాహితి లిరిక్స్ హుహారెత్తించేవిగా ఉన్నాయి. తమన్ అందించిన ఊర మాస్ బీట్ అదిరింది అంటూ అభుమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.


నితిన్ డాన్స్ తో సినిమాలో ఈ సాంగ్ ని చూస్తే ఆడియన్స్ విజిల్స్ కొట్టడం పక్కా అని చిత్ర యూనిట్ చేబుతోంది. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కహాని అందించినట్లు తెలుస్తోంది.

English summary
Chal mohan ranga new song released. Superb response for the song
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu