»   » బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, అమ్మాయిల దుస్తులపై.... చలపతి రావు వివాదాస్పద కామెంట్!

బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, అమ్మాయిల దుస్తులపై.... చలపతి రావు వివాదాస్పద కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సీనియర్ నటుడు చలపతి రావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ద ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, మనవడు జూ ఎన్టీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

ఓ ప్రశ్నకు చలపతి సమాధానం చెబుతూ.... పెద్దాయనకు పది కిలోమీటర్ల వరకు ఎవరూ రాలేరు... వచ్చే అవకాశమే లేదు. జూ ఎన్టీఆర్ కాదు ఎవరొచ్చినా కూడా కష్టమే. ఆయన స్టైల్ వేరు, ఆయన ధర్మాత్మికత వేరు, ఆయన క్రియేషన్ వేరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రిప్టు రైటర్‌గా, మానవత్వం గల మనిషిగా ఆయన లెవల్ కి ఎవరూ రారు. ఈ జూ ఎన్టీఆర్ కానీ ఇంకొకరు కానీ ఎవరూ రారు అని చలపతి రావు అన్నారు.

జూ ఎన్టీఆర్... మనిషి మరీ జానెడైపోయాడు

జూ ఎన్టీఆర్... మనిషి మరీ జానెడైపోయాడు

జూ ఎన్టీఆర్ ఏ పాత్ర ఇచ్చినా చేయగలడు. చిన్నతనం నుండి డాన్సులు, నటన అన్నీ నేర్చుకున్నాడు. కాక పోతే మనిషి మరీ జానెడు అయిపోయాడు. ఏదైనా పెద్ద రావణాసురుడు లాంటి వేషం వేయాలంటే ఫిట్ కాడు. క్యారెక్టర్ ఫిట్ నెస్ లేదు అని అన్నారు.

Balakrishna to romance with Charmi Kaur - Filmibeat Telugu
ఒకరి గురించి మాట్లాడటం తప్పు

ఒకరి గురించి మాట్లాడటం తప్పు

కానీ ఒక పర్సన్ గురించి, అతడి నటన గురించి మాట్లాడటం చాలా తప్పు. నీకు ఒక సినిమా తీద్దామని నచ్చి రావణాసురుడిగా అతడిని చేయిస్తానంటే నేను వద్దనలేను కదా. జనం చూస్తారా? చస్తారా? అనేది తర్వాతి విషయం. ముందు నువ్వు సినిమా తీస్తావు. అది వారి పర్సనల్ విషయం అని చలపతిరావు అన్నారు.

ఆ సినిమాలకు ఎవరూ సూట్ కారు

ఆ సినిమాలకు ఎవరూ సూట్ కారు

మరో ప్రశ్నకు చలపలపతిరావు స్పందిస్తూ.... ఎన్టీఆర్, నాగేశ్వరరావు గుండమ్మ కథ సినిమా ఇపుడు ఎవరు రీమేక్ చేసినా బాగోదు. రామారావు క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. నాగేశ్వరరావు గారి రొమాన్స్ అంటే కొంత వరకు చేయొచ్చు. కొన్ని కళాఖండాలు ఉన్నాయి. రాముడు-భీముడు, గుండమ్మక కథ ఎవరూ చేసినా బాగోదు అన్నారు.

పెద్ద ఎన్టీఆర్ నటనకు వారసులు లేరు

పెద్ద ఎన్టీఆర్ నటనకు వారసులు లేరు

పెద్ద ఎన్టీఆర్ వారసులు ఎవరు? అనే ప్రశ్నకు చలపతి రావు స్పందిస్తూ.... బాలకృష్ణ, జూ ఎన్టీఆర్‌లలో ఎవరూ ఆయన వారసులు కాదు. ఆయన నటనకు వారసులు లేరు. ఆయన నటన ఆయనతోనే ఎండ్ అని చలపతి రావు వ్యాఖ్యానించారు.

అవార్డులు చెత్త

అవార్డులు చెత్త

అవార్డుల విషయమై స్పందిస్తూ.... రామారావు గారు ఈ గవర్నమెంటు ఇచ్చే అవార్డులన్నీ చెత్త అని చెప్పేవారు. ఎవరికి ఓపిక ఉంటే వారు తెచ్చుకుంటారు. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ వారం మీరు ఊర్లో ఉంటున్నారా? అని అడిగే వారు. ఎందుకంటే మీకు అవార్డు ఇద్దామనుకుంటున్నాం అనేవారు. ఎవరు ఊర్లో ఉంటే వాళ్లకు ఒక అవార్డు ఇచ్చేవారు. ప్రజలు ఇచ్చిన అవార్డులే చాలు అని రామారావు అనే వారు అని చలపతి రావు గుర్తు చేసుకున్నారు.

అమ్మాయిలకు ఓణీల ప్రధాన్యత తెలియదు

అమ్మాయిలకు ఓణీల ప్రధాన్యత తెలియదు

మరో ప్రశ్నకు స్పందిస్తూ.... ఈ కాలంలో అమ్మాయిలు ఫ్యాంటు, టీషర్టు వేసుకుంటే తప్పని నేను అనడం లేదు. గ‌తంలోనైతే ఓణీలు వేసుకునేవార‌ు. ఇప్ప‌టి అమ్మాయిలు మాత్రం ఆ ఓణీలు ఎందుకు వేసుకుంటారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందుకే చున్నీలని తలకు, నడుముకు చుట్టుకుంటున్నారని చలపతి వ్యాఖ్యానించారు.

మేము ఏమైనా చెబితే చాదస్తం అంటారు

మేము ఏమైనా చెబితే చాదస్తం అంటారు

ఇప్పటి అమ్మాయిలు వేసుకునే దుస్తుల గురించి మాలాంటి వారు ఎవరైనా త‌ప్పు అని చెప్పాల‌ని చూస్తే.... చాదస్తపరుడు, ముసలోడు అని అంటారని చలపతి రావు అభిప్రాయ పడ్డారు.

కుర్రాళ్లు కామెంట్స్ చేస్తారు

కుర్రాళ్లు కామెంట్స్ చేస్తారు

అమ్మాయిలు ఓణీని మెడకి లేదా తలకో చుట్టుకుని వెళ్లినపుడు వారిని చూసిన కుర్రాళ్లు కామెంట్ చేస్తార‌ు. అలాంటపుడు అమ్మాయిల‌కు ఓపిక ఉంటే వారితో దెబ్బలాడ‌తార‌ని, లేదంటే సైలెంట్‌గా తలదించుకుని వెళ్లిపోతార‌ని అన్నారు. ఇటువంటి దుస్తులు ధ‌రించి జీవితాంతం ఇలాగే దెబ్బలాడే ప‌రిస్థితి ఎందుక‌ని చలపతి రావు అభిప్రాయ పడ్డారు.

English summary
'Women are wearing t-shirt & jeans these days. I am not saying that it's something wrong! But, Girls were given voni after they reach puberty at the age of 13 or 14 to cover their chest. But, How they have been using the voni's Today?'" Chalapathi Rao said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X