»   » అడ్డమైన ఆడవాళ్ళ దగ్గరికి పోలేదు, తప్పే అని మీరు ఫీలైతే! క్షమించండీ..! : చలపతి రావు

అడ్డమైన ఆడవాళ్ళ దగ్గరికి పోలేదు, తప్పే అని మీరు ఫీలైతే! క్షమించండీ..! : చలపతి రావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలనుద్దేశించి చులకన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో పెద్ద తరహా వేసాలు వేస్తుంటారు చలపతిరావు. విలన్ వేషాలకు దూరం జరిగి.. తండ్రి, తాత, పెదనాన్న వంటి పాత్రలు వేస్తున్నారు. అయితే.. సినిమాల్లో విలనిజం వదిలినా.. బయట మాత్రం వదిలినట్టుగా లేదు. అందుకే అమ్మాయిలపై అత్యంత అనుచిత వ్యాఖ్యానాలు చేశారీయన..

షాకింగ్ కామెంట్స్

షాకింగ్ కామెంట్స్

ఆదివారం సాయంత్రం జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా చలపతిరావును.. యాంకర్‌ ఒక ప్రశ్న అడిగారు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా మీరు చెప్పండి అంటూ సీనియర్ నటుడు చలపతిరావును యాంకర్ ప్రశ్నించారు. దీంతో మైక్ తీసుకున్న చలపతిరావు... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు గానీ.. పక్కలోకి మాత్రం పనికొస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రారండోయ్ వేడుక చూద్దాం

రారండోయ్ వేడుక చూద్దాం

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం'. ఈ చిత్రం ఆడియో వేడుకను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఘ‌నంగా జరిగింది. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ట్రైల‌ర్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ఉద్దేశించి చైతూ ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అంటూ ఓ డైలాగ్ చెపుతాడు.

పక్కలోకి పనికి వస్తారంటూ

పక్కలోకి పనికి వస్తారంటూ" సమాధానం

ఈ నేప‌థ్యంలో ఆ డైలాగ్‌పై అభిప్రాయాన్ని తీసుకుంటున్న ఓ యాంక‌ర్ చ‌ల‌ప‌తిరావు వ‌ద్ద‌కు వ‌చ్చి, 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?' అని ప్ర‌శ్నించింది. పెద్ద వ‌య‌స్కుడైన చలపతి రావు అందుకు షాకింగ్ సమాధానం ఇచ్చారు. "అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికి వస్తారంటూ" సమాధానమిచ్చారు.

యాంకర్ రవి

యాంకర్ రవి

ఈ షాకింగ్ కామెంట్స్‌కు యాంకర్ బిత్తరపోయి నేరుగా వేదికపైకి వెళ్లిపోయింది. నటుడు చలపతిరావు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై ఖండించాల్సి పోయి.. యాంకర్ రవి మాత్రం సూపర్ సమాధానం ఇచ్చారు అంటూ ఆయనను సమర్ధించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్

భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్

మహిళా సంఘాలన్నీ కలిసి జూబ్లి హిల్స్ పోలీస్టేషన్ ముందు పెద్ద ప్రదర్శనగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.. మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యవతి, మహిళా ఉద్యమకారిణి దేవి తదితర నేతలు చలపతి రావుపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

వీడియో సందేశం

వీడియో సందేశం

ఈ వ్యవహారమంతా చూసి దిగిరాక తప్పదనుకున్నారో గానీ చలపతి రావు ఆ మాటల మీద తన ఫేస్ బుక్ లో ఒక వీడియో సందేశం లో వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం..! ముఖ్యంగా నారీ లోకానికి నమస్కారం.. నిన్న ఫంక్షన్ లో నేను తప్పుగా మాట్లాడాననీ, మీరు భాదపడ్డారని నేను విన్నాను.

 స్త్రీలని సమర్థించటానికే

స్త్రీలని సమర్థించటానికే

మీ అందరినీ నేను కోరేదేమిటంటే నేను మాట్లాడింది డబల్ మీనింగ్ గాతీసుకోవద్దు. నేను స్త్రీలని సమర్థించటానికే అలా మాట్లాడాను అంటూ చెప్పిన ఆయన ఆడది మన:శ్శాంతికి ప్రమాదకరం అంటే ఎవ్వరూ ఖండించక పోవటం తనకు భాదకలిగించిందని చెప్తూనే ఆయన శైలి లోని భాషలోనే వివరణ ఇచ్చారు.

అడ్డమైన ఆడవాళ్ళు

తన భార్య చని పోయాక తాను ఒంటరిగా ఉండిపోయాననీ "అడ్డమైన ఆడవాళ్ళ" దగ్గరికి పోలేదనీ మళ్ళీ అదే తరహా భాష లోనే తనవివరన ఇచ్చారు. అసలు నామాట మీకెందుకు తప్పనిపించిందో కూదా నాకర్థం కాలేదు... ఆడవాళ్లని తల్లుల్లాగా, చెల్లెల్లలాగా ఎప్పుడూ గౌరవిస్తాననీ చెప్పి..చివరలో "జై మహిళాలోకం" అంటూ ముగించారు... ఆయన చెప్పిన వివరణ ఇక్కడే చూడండి...

English summary
Tollywood Senior Actor Chalapathi rao explanation on derogatory comments at Akkineni naga chaithanya's new Movie Rarandoy veduka chuddam Audio function on sun Day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu