twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చందమామ కథలు ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మనోజ్, మంచు లక్ష్మి సందడి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమణి, కృష్ణుడు, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచా పనయ్, చైతన్య కృష్ణ, పృథ్వి, వెన్నెల కిషోర్, కొండవలస, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'చందమామ కథలు'. మార్చి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పాటలను సీడీల రూపంలో కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ ద్వారా విడుదల చేసారు.

    ఎ వర్కింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బూణేటి చాణక్య నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. మిక్కీ.జె మేయర్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర తారాగణంతో పాటు మంచు హీరో మనోజ్ సందడి చేసారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ప్రత్యేకమైన డ్రెస్సింగుతో ఆకట్టుకుంది.

    అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

    మంచు లక్ష్మి

    మంచు లక్ష్మి


    ఇదొక మంచి సినిమా. ఇలాంటి మంచి సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని సినిమా చేసాం అన్నారు. సినిమా థియేటర్లకు వెళ్లి చూస్తేనే మజా వస్తుంది అన్నారు.

    మనోజ్ మాట్లాడుతూ...

    మనోజ్ మాట్లాడుతూ...


    ఈ సినిమా గురించి అక్క చెబుతూనే ఉంది. ఈ దర్శకుడి ఫస్ట్ సినిమా చూసాక ఆయనలో విషయం ఉందని అర్థమైంది. ఇది డిఫరెంట్ సినిమా. కమర్షియల్‌ అంశాలు కూడా ఉన్నాయి అన్నారు.

    నరేష్ మాట్లాడుతూ...

    నరేష్ మాట్లాడుతూ...

    ఈ చిత్రంలో నా మధ్య, ఆమని మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్ ఉందా? లేదా? అనేది సస్పెన్ష్ అని చెప్పుకొచ్చారు.

    సంగీత దర్శకుడు మాట్లాడుతూ..

    సంగీత దర్శకుడు మాట్లాడుతూ..

    సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం వనమాలి, అనంతశ్రీరామ్, కృష్ణ చిన్ని మంచి లిరిక్స్ అందించారు. సీడీలు పెద్దగా సేల్స్ కావనే ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నాం అన్నారు.

    కథ

    కథ


    అది 1972, ఇంకా ఆధునికతకు అంతగా అలవాటు పడనికాలం... 18ఏళ్ల సరిత, 20 ఏళ్ల మోహన్ ప్రేమించుకున్నారు, పెళ్ళిచేసుకోవా లనుకున్నారు. సరిత ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. అర్థం చేసుకునే అమ్మా నాన్న ఉన్నా మోహన్ తన వైపు నుంచి ఏం చేయలేయక పోయాడు సరిత చివరి ప్రయత్నంగా ఎదిరించింది వాళ్ళు చచ్చిపోతామని బెదిరించారు. దీంతో తల్లితండ్రులు చూపించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఇక ఈ దేశంలోనే ఉండడానికి మనసు ఒప్పక మోహన్ అమెరికాకి వెళ్ళిపోయాడు... కాలం వేగం అందుకుంది...40 ఏళ్లు ఎలా గడిచాయో తెలియనంత వేగం...2012, మోహన్ తిరిగి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...


    దర్శకుడు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ... ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో చోట్ల తనకి తారసపడే వ్యక్తుల ద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా సమాజంలో మంచి చెడుల్ని చూస్తుంటాడు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకొని మరి కొన్నింటిని నేర్చుకుంటుంటాడు. అలాగే కొన్ని అనుభవాలను కూడా సంపాదిస్తుంటాడు. అటువంటి కొన్ని పాత్రల అనుభవాలు, పర్యావసనాలు, ఫలితాల సమాహారమే 'చందమామ కథలు'. సినిమా కథాంశం. అన్నారు.

    చందమామ కథలు

    చందమామ కథలు


    'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్‌ నటుడు నరేష్‌, ఆమని, కృష్ణుడు, కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

    English summary
    Chandamama Kathalu Audio Release Function held at Hyderabad. Actress Richa Panai, Isha Ranganath (Amitha Rao), Shamili Agarwal, Lakshmi Manchu Prasanna, Director Praveen Sattaru, Vijaya Naresh, Music Director Mickey J Meyer, Abhijeet, Producer Chanakya Booneti graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X