»   » ‘చందమామ కథలు’ చిత్రానికి జాతీయ అవార్డు

‘చందమామ కథలు’ చిత్రానికి జాతీయ అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ కథలు' చిత్రానికి జాతీ అవార్డు దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు.

ఒకే సినిమాలో ఎనిమిది కథలు చూపించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలోని 8 కథలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

వెంకటేశ్వరరావు (కృష్ణుడు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లి కాక ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగైనా 30 దాటేలోగా పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు.
లీసా (ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌) ఓ టాప్ మోడ‌ల్‌. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి పతనం అవుతుంది. దీంతో పాటు ప్రియుడు (ఫృథ్వీ) వదిలి వెళ్లి పోతాడు. దీంతో మద్యం, సిగరెట్లకు అలవాటు అవుతుంది.

 Chandamama Kathalu wins National Award

పాత బస్తీలో ఉండే అష్ర‌ఫ్ (అభిజిత్‌) ప్రియురాలు హ‌సీనా (రిచాప‌న‌య్‌) ఆస్తి కోసం ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది.
చైతన్య కృష్ణ కాలేజ్ స్టూడెంట్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన క్లామ్ మేట్ ని ప్రేమిస్తాడు. ఇద్దరూ కలిసి పారిపోవాలనుకుంటారు.
పల్లెటూర్లో గాలితిరుగుడు తిరిగే రఘు(నాగ శౌర్య) పక్క వీధిలో ఉండే గౌరీ (అమిత రావు) ని ప్రేమిస్తాడు....
ఓ బిచ్చ‌గాడు (కృష్ణేశ్వ‌ర‌రావు) సొంతింటి కల తీర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెడతాడు.
అమెరికా నుంచి ఇండియా వచ్చిన మోహ‌న్ (న‌రేష్‌) భర్త దూరమైన తన మాజీ ప్రియురాలు స‌రిత (ఆమ‌ని)కు దగ్గరవుతాడు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటారు.
ఒకే కాలేజీలో చదువుకునే పేద కుర్రాడు రఘు (చైతన్య కృష్ణ) డబ్బున్న రేణు(షామిని అగర్వాల్)ని లొంగదీసుకుని వాళ్ల ఇంటి అల్లుడు కావాల‌నే ప్లాన్లో ఉంటాడు.
వాస్తవికతను చూపించడం ద్వారా మంచి సినిమా తీసాడనే భావనను తేవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. వైవిద్యత చూపిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చని విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

English summary
It is indeed a proud moment for director Praveen Sattaru and his team as the critically acclaimed Chandamama Kathalu won the National Award for the best film in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu