Just In
Don't Miss!
- Sports
గబ్బా టెస్ట్ విజయం అత్యంత సంతోషాన్నిచ్చింది: మోడీ
- News
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓ నిర్మాతతో రెండేళ్ల కాంట్రాక్ట్.. అసలు గుట్టు విప్పిన చాందినీ చౌదరీ
ప్రస్తుతం చాందిని చౌదరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కలర్ ఫోటో సినిమాతో ఇటు టాలీవుడ్‌లో అటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి చాందిని చౌదరికి ఎప్పుడో రావాల్సిన ఈ గుర్తింపు ఇంత ఆలస్యంగా వచ్చింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయి ఆ తరువాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చిన్న సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన చాందినీకి ఎట్టకేలకు గుర్తింపు వచ్చింది.

షార్ట్ ఫిలిమ్స్‌తో..
చాందిని చౌదరి ష్టార్ట్ ఫిలిమ్స్ హవా నడిచిన కాలంలో ఓ ఊపు ఊపేసింది. మధురం సినిమాలో అందాలతో కవ్వించి.. నటనతో మెప్పించింది చాందినీ. అప్పటి నుంచి చాందినికీ అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ సినిమాలు మాత్రం అంతగా ఆడలేదు. గుర్తింపును తీసుకురాలేదు.

చిన్న సినిమాలతో..
మధురం షార్ట్ ఫిలిమ్ తరువాత చాందినీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగాయి. కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జ్, మను వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఏవీ కూడా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా కలర్ ఫోటోతో వార్తల్లో నిలిచింది.

లుక్స్, యాక్టింగ్..
చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె లుక్స్, యాక్టింక్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే చాందినీకి అంతకు ముందే అదిరిపోయే అవకాశాలు వచ్చాయట. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని మిస్ చేసుకుందట. వాటి గురించి తాజాగా చాందినీ చౌదరి నోరు విప్పింది.

నిర్మాతతో కాంట్రాక్ట్..
కెరీర్ ప్రారంభంలో చాలా మందిలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని చాందినీ చౌదరీ అసలు సంగతులు చెప్పింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలసి రాలేదని పేర్కొంది. అలాంటి సమయంలో కలర్ ఫోటో మాంచి విజయాన్ని అందించిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లు తన వద్దకు వచ్చాయని కానీ... అదే సమయంలో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర తాను కాంట్రాక్ట్‌లో ఉన్నానని తెలిపింది. దానివల్ల రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయిందని అలా ‘కుమారి 21F', ‘పటాస్'లో నటించే చాన్స్ మిస్సయ్యాను అని చెప్పుకొచ్చింది.