ఆ విషయంలో కంటతడి.. స్టేజ్ మీదే చాందినీ చౌదరిని ఓదార్చిన నవీన్ చంద్ర

చాందినీ చౌదరి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఇన్నేళ్లకు చాందినీ చౌదరికి నటిగా మంచి గుర్తింపు లభించింది. చాందినీ ఈ సినిమాతో మంచి ఆఫర్లను చేజిక్కించుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో చాందినీ బిజీగా ఉంటోంది. ఆమె తాజాగా నటించిన సూపర్ ఓవర్ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ఈవెంట్‌లో చాందినీ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

Recommended Video

Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
సూపర్ ఓవర్..

సూపర్ ఓవర్..

క్రికెట్ నేపథ్యంలో, బెట్టింగ్‌ల ఆధారంగా సూపర్ ఓవర్ అనే చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ రేపు విడుదల కాబోతోండగా నిన్న మీడియాతో ముచ్చటించారు. అయితే ఈ మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈమూవీని తెరకెక్కిస్తున్న సమయంలోనే దర్శకుడు ప్రవీణ్ మృతిచెందాడు.

యాక్సిడెంట్‌తో..

యాక్సిడెంట్‌తో..

సినిమా షూటింగ్ జరుగుతుండగానే దర్శకుడు ప్రవీణ్ మృతి చెందాడు. సినిమా షూటింగ్‌లో భాగంగానే ప్రవీణ్ మరణించడంతో యూనిట్ మొత్తం ఆ సమయంలో ఎమోషనల్ అయ్యారు. అలా దర్శకుడు లేకపోయినా కూడా ఆయన కలను మాత్రం నిజం చేసేందుకు యూనిట్ మొత్తం కలిసి పని చేసింది.

చాందినీ కంటతడి..

చాందినీ కంటతడి..

అలా దర్శకుడి లేని లోటును చాందినీ చౌందరి తట్టుకోలేకపోయింది. ఆయన్ను తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. క్రికెట్ బెట్టింగ్ మీద ప్ర‌వీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడు. ఇది మీకు క‌చ్చితంగా న‌చ్చుతుంది అనుకుంటున్నాము. ఈ మూవీ ప్ర‌వీణ్‌కి అంకితం అని చాందినీ చెబుతూ కంటతడి పెట్టేసింది.

ఓదార్చిన నవీన్ చంద్ర..

ఓదార్చిన నవీన్ చంద్ర..

ఇక అలా చాందినీ చౌదరి కంటతడిపెడుతూ ఉండగా నవీన్ చంద్ర ఓదార్చాడు. ఇక నవీన్ చంద్ర కూడా దర్శకుడితో ఉన్న అనుభవాలు తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్ర‌వీణ్ చ‌నిపోయిన త‌రువాత ఈ సినిమాను అంద‌రి ముందుకు తీసుకొచ్చేందుకు సుధీర్ చేసిన ప్ర‌య‌త్నానికి హ్యాట్సాఫ్. అత‌డి గురించి మాకే ఎలానో ఉంది. వాళ్లింట్లో వాళ్లకు దేవుడు బ‌లం ఇవ్వాలంటూ కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X