»   » యూట్యూబ్ బ్యూటీ చాందిని చౌదరికి మహేష్ బాబు ఆఫర్

యూట్యూబ్ బ్యూటీ చాందిని చౌదరికి మహేష్ బాబు ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చూసే వారికి చాందిని చౌదరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇన్నాళ్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవలే ‘కేటుగాడు' చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాందినీ చౌదరికి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ బాబుతో కలిసి చాందిని చౌదరి స్టెప్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. మహేష్ బాబుతో నటించడంతో తనకు మున్ముందు మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.

బ్రహ్మోత్సవం చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 7,2016న విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమాచారం. అలాగే మార్చి నెలాఖరకు చిత్రానికి సంభందించిన అన్ని పనలు పూర్తి చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

Chandini Chowdary to shake a legs with Prince

ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.

సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Telugu actress Chandini Chowdary is shaking her legs with Tollywood Prince Mahesh Babu and she will make special appearance in the Bhramotsavam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu