బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ

కథ సిద్దు(అక్షయ్) అనే చాందినీ చౌక్ లో ఉండే ఓ వంటవాడి చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు తనను తాను నమ్ముకోక అదృష్టం కోసం జ్యోతిష్కుల చుట్టూ తిరిగటం,లాటరీల కొట్టడం నిత్య కృత్యంగా గల అతనికి అనుకోకుండా చైనా వెళ్ళే ఆఫర్ వస్తుంది. చైనా లో ఉండే ఓ యోధుడు తాను తిరిగి పునర్జన్మ ఎత్తుతానని చెప్పి మరణిస్తాడు. అతను కోసం వెతుకుతున్న కొందరు వ్యక్తులకు అదే పోలికలతో ఉన్న సిద్దు కన్పడతారు. వారు అతన్ని ఒప్పించి తమతో తీసుకుపోతారు. అక్కడ వారి పల్లెకి ఓ విలన్ మూలంగా కష్టాలు వస్తూంటాయి. వాటిని తప్పించమని అడుగుతారు. తన్నులు తినడమే గాని,ఎదురు తిరగటం చేతకాని సిద్దు అక్కడ వారి కష్టాలు ఎలా తీర్చాడన్నది కథ.
ఈ సినిమాలో మరో ట్రాక్ లో హీరోయిన్ దీపికా పడ్కోనితో పాత సీతా అవుర్ గీతా లాంటి డబుల్ ట్రబుల్ కవల పిల్లల డ్రామా జరుగుతుంది. అదే సినిమాని సగం దెబ్బతీసింది. హాలీవుడ్ యానిమేషన్ కుంగు ఫు పూండా సినిమాను గుర్తు చేసే సినిమా ఆ రేంజిలో లేకపోవంటం ఊహించని విధంగా కామిడీ లేకపోవటం సినిమాకు మైనస్ అయి నిలిచాయి. అయినా అక్షయ్ అభిమానులు ఒక్కసారి చూడవచ్చు. కాని వారు డీవీడీ వచ్చే వరకూ ఆగటమే మేలు.


Click it and Unblock the Notifications