»   » 'అందరి బంధువయ' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

'అందరి బంధువయ' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ నలుగురు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన చంద్ర సిద్దార్ద తాజా చిత్రం 'అందరి బంధువయ'. శర్వానంద్‌, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాత చంద్రసిద్దార్ధ ఈ చిత్రం విశేషాలు మీడియాకు తెలియచేస్తూ...'స్వార్థపూరితమైన ఈ లోకంలో పొరుగు వారి కోసం ఒక్క క్షణం బతికినా చాలు. కనీసం ఎదుటివారి గురించి ఆలోచించడానికి కాస్త సమయం కేటాయిస్తే మేలు. ఈ అంశంతోనే కథను అల్లుకున్నాం. ఎదుటివారికి సాయం చేయబోయిన మా జంటకు జీవితంలో ఎలాంటి మలుపులు ఏర్పడ్డాయి? అవి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్నది ఆసక్తికరం. అంటున్నారు. నరేష్‌, ఆర్.కె, కృష్ణభగవాన్‌, విజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, ప్రగతి కీలకమైన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రచన బలభద్రపాత్రుని రమణి అందించగా, పాటలు చైతన్యప్రసాద్‌, సంగీతం అనూప్‌ రూబెన్స్‌, కెమెరా కె.గుమ్మడి నిర్వహించారు. ఈ చిత్రం కూడా ఆ నలుగురులా సందేశాత్మకంగా ఉండి అందరి మన్ననలూ పొందుతుందని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu