»   » ఎన్నికలు ముగిసాయి: పవన్ రూపం మారింది!(ఫోటోలు)

ఎన్నికలు ముగిసాయి: పవన్ రూపం మారింది!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు రాజకీయ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. సినిమాల్లో ఉన్నపుడు ఎప్పుడూ నీట్‌గా షేవ్ చేసుకుని కనిపించే పవన్ కళ్యాణ్.....ఎన్నికల ప్రచారంలో ఉన్నంతకాలం భారీ గడ్డంతో కనిపించారు. ఇద్దరు గడ్డం బాబులు(మోడీ, చంద్రబాబు) మధ్య తాను గడ్డం బాబుగా మారిపోయారు.

నిన్న ఎన్నికలు ముగిసాయి. ఇన్నాళ్లు గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్....ఈ రోజు నీట్‌గా షేవ్ చేసుకుని కనిపించారు. పొలిటికల్ ప్రచారంలో ఉన్నంత కాలం ఒకే రకమైన డ్రెస్ కోడ్ మెయింటేన్ చేసిన పవన్ కళ్యాణ్‌లో.....ఇపుడు పూర్తిగా మార్పు వచ్చింది. తన రూపం పూర్తిగా మార్చుకున్నారు. గురువారం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి లంచ్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా హీరోలా వెలిగిపోయారు.

ఈసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పూర్తి ధీమాతో ఉన్నారు. ఇద్దరూ కూడా ఈ నెల 16న జరిగే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటారని తెలుస్తోంది.

ఇక ఎన్నికలు ముగిసాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2' చిత్రంతో పాటు, హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రం తెలుగు రీమేక్ కోసం డేట్స్ ఇచ్చారు.

చంద్రబాబుతో పవన్

చంద్రబాబుతో పవన్

చంద్రబాబు నాయుడు లంచ్ కి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి వెళ్లారు.

చంద్ర బాబు, పవన్

చంద్ర బాబు, పవన్

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కర చాలనం. పక్కనే లోకేష్

విజయంపై ధీమా

విజయంపై ధీమా

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు మంచి ఫలితాలు సాధిస్తాయనే ధీమాతో ఉన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎన్నికలు ముగిసాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తన కమిటైన సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది.

English summary
The elections in Seemandhra are over and it’s time for pleasantries. Chandrababu invites Pawan Kalyan for lunch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu