»   » ప్రముఖ నటుడు చంద్రమోహన్‌కు గుండెపోటు

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌కు గుండెపోటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా నటుడు చంద్ర మోహన్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉండటం, ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఈ విషయమై ఆయన మేనల్లుడు కృష్ణ ప్రసాద్ స్పందిస్తూ....ప్రస్తుతం చంద్రమోహన్ ఆరోగ్యంగా ఉన్నారని, చెస్ట్ లో ఫ్లమ్ రావడంతో పెయిన్ వచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. 


ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Chandramohan gets heart attack, admits in Apollo

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

English summary
Tollywood actor Chandramohan gets heart attack, admits in Apollo Hyderabad hospital.
Please Wait while comments are loading...