»   » మోహన్ లాల్, గౌతమి ప్రధానపాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి సినిమా

మోహన్ లాల్, గౌతమి ప్రధానపాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్, విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓ నూతన చిత్రం ప్రారంభంకానుంది. ‘ఐతే', ‘అనుకోకుండా ఒకరోజు', ‘ఒక్కడున్నాడు', ‘ప్రయాణం', ‘సాహసం' వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే'తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

‘ఈగ', ‘అందాల రాక్షసి','లెజండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Chandrasekhar Yeleti To Direct Mohan Lal

ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి పనిచేస్తన్న ఈ చిత్రం నవంబర్ 3వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సాయి కొర్రపాటి తెలియజేశారు.

English summary
Acclaimed director Chandrasekhar Yeleti, who is known for his deft handling of novel scripts, is going to direct a trilingual film which stars Malayalam superstar Mohan Lal in the lead role.
Please Wait while comments are loading...