»   » కొమరం పులి కాదు..కొణిదల పిల్లిగా మార్చండి

కొమరం పులి కాదు..కొణిదల పిల్లిగా మార్చండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొమరం పులి కాదు.. కొణిదల పిల్లిగా సినిమా పేరును మార్చుకోవాలంటూ సోనేరావు సూచించారు. కొమరంపేరు మార్చని పక్షంలో సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొమరం భీం అనేది తమ ఇంటి పేరని, దేశంలో మరేవరికీ లేదని, కొమరం అనేది తమ పేటెంట్ హక్కుగా తేల్చి చెప్పారు. కొమరం భీంలాంటి మహనీయుడి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా నటుడు పవన్ కళ్యాణ్, సినీ నిర్మాతలకు లేదని ఆయన అన్నారు. ఆదివాసీ హక్కుల సాధనకు పోరాడిన వీరయోధుడు కొమరం భీం పేరును సినిమాకు వాడుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

వీరయోధుడి పేరు చివరన క్రూరమృగం పేరు పెట్టుకోవడం సమంజసం కాదంటూ కొమరం భీం మనవడు కొమరం సోనేరావు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొమరం భీం పవిత్రతను వ్యాపారానికి వాడుకుంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ అంటూ నినాదమెత్తుకుని సమైక్యవాదం పేరిట తప్పించుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు గోడమీద పిల్లులని ఆయన అభివర్ణించారు.ఇక కొమురం పులి చిత్రం ఓ ప్రక్క ఫైనాన్సియల్ వివాదం, మరో ప్రక్క టైటిల్ వివాదం మోసుకుని సెప్టెంబర్ పదవ తేదీన విడుదల అవటానికి రెడీ అవుతోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu