»   » పాత 'మరో చరిత్ర' కంటే బావుంది...నరేష్

పాత 'మరో చరిత్ర' కంటే బావుంది...నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మరో చరిత్ర సినిమా వినూత్న ప్రేమ కథా చిత్రమని, పాత మరో చరిత్ర సినిమాకంటే సహజత్వం ఉట్టిపడిందని ప్రముఖ నటుడు నరేష్‌ అన్నారు. అలాగే పోలీసుగా, పురోహితుడుగా తను పోషించిన పాత్ర ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. హీరో వరుణ్‌సందేశ్‌, హీరోయిన్ ‌అనిత ప్రేమికులుగా నటనలో అద్భుతంగా జీవించారని చెప్పారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సుదర్శన్‌ 35ఎంఎంలో ఆదివారం మరో చరిత్ర సినిమాను ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే డైరెక్టర్‌ రవియాదవ్‌ అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు రమణీయంగా, యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే దిల్ రాజు 'మరో చరిత్ర' చూసిన వారెవరూ బాలచందర్ చిత్రంతో 'మరో చరిత్ర' తో దాన్ని పోల్చటానికి ఇష్టపడటం లేదన్నది తెలిసిందే. భాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఐపిఎల్ క్రికెట్, పిల్లల పరీక్షలుతోనే ఈ టాక్ వచ్చిందని దిల్ రాజు చెప్తూ వస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu