Don't Miss!
- News
క్విట్ జగన్ -కేంద్రంతో సంబంధాలు : తిరిగి అధికారం ఖాయం - టీడీపీ రాజకీయ తీర్మానం..!!
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉ అంటావా మావ అంటూ.. ఘాటైన స్టెప్పులతో మతిపోగొట్టేసిన ప్రగతి.. షాక్ అవ్వాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లిగా ఆమె ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇటీవల పుష్ప సినిమాల్లోని ఐటెమ్ సాంగ్ కు కూడా ప్రత్యేకంగా డాన్స్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచి నటిగా..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న నటన ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎలాంటి పాత్రలో కనిపించిన కూడా డిఫరెంట్ టైమింగ్ తో ఆకట్టుకుంటారు. ఎమోషనల్ అయినా సరే కామెడీ రోల్ అయినా సరే తనదైన శైలిలో హైలెట్ అయ్యేలా నటిస్తూ ఉంటారు. దర్శకులు చెప్పిన దానికంటే కూడా ప్రగతి మరింత డిఫరెంట్ గా నటించేందుకు ప్రయత్నం చేస్తుందని ఒక పాజిటివ్ టాక్ అయితే ఉంది.

స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లో..
అయితే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమాల్లో తప్పితే బయటి ప్రపంచంలో ఎక్కువగా కనిపించరు. కానీ ప్రగతి మాత్రం సోషల్ మీడియా ద్వారా జనాలకు ఇంకా దగ్గర అవుతూనే ఉంది. తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు అందరి హీరోలకు ఆమె తల్లి పాత్రలో కనిపించారు. అంతేకాకుండా. చిరుత సినిమాలో ఆమె చేసిన తల్లి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మరికొన్ని కామెడీ సినిమాల్లో కూడా ఆమె నటనతో ప్రేక్షకులను నవ్వించారు.

45 అంటే నమ్మడం కష్టమే..
సోషల్
మీడియాలో
ప్రగతి
తన
గ్లామర్
తో
ఎంతగానో
ఆకట్టుకుంటోంది.
ఆమె
వయస్సు
నాలుగు
పదులు
దాటినా
కూడా
ఇంకా
నేటి
తరం
హీరోయిన్స్
తరహాలోనే
తన
అందంతో
ఎంతగానో
ఆకర్షిస్తున్నారు.
ప్రగతి
వయసు
45
అంటే
నమ్మడానికి
కాస్త
కష్టంగానే
ఉంటుంది
ఆమె
అప్పుడే
పాతికేళ్లు
దాటిన
అమ్మాయిలా
కనిపిస్తుంది
అని
ఫాలోవర్లు
పాజిటివ్
గా
స్పందిస్తూ
ఉంటారు.
పుష్ప ఐటెమ్ సాంగ్..
ఎప్పటికప్పుడు తన జిమ్ వర్కౌట్ తో కూడా ప్రగతి నెటిజన్లకు షాక్ ఇస్తోంది. జిమ్ లో దాదాపు అన్ని రకాల వర్కౌట్స్ చేస్తూ చాలా బరువులను కూడా ఈజీగా ఎత్తేస్తుంది. అప్పుడప్పుడు ఆమె కొన్ని పాటలకు కూడా డ్యాన్సులు చేస్తూ ఫాలోవర్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇటీవల మరోసారి వైరల్ అయ్యేలా పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ ను హాట్ స్టెప్పులతో ప్రజెంట్ చేసింది.

ఉ అంటావా మావ..
పుష్ప సినిమాలో సమంత చేసిన ఉ అంటావా మావ..ఉ ఉ అంటావా మావా అనే పాట ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ పాటను ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ప్రగతి కూడా తనదైన శైలిలో హాట్ గా స్టెప్పులు వేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ప్రగతి ఇటీవల కాలంలో తన సోషల్ మీడియాలో కూడా గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.