»   » నటి బండ జ్యోతి కన్నుమూత

నటి బండ జ్యోతి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : తెలుగు సినీ హాస్య నటి బండ జ్యోతి కన్నుమూసింది. హైదరాబాద్ లోని నానక్ రాం గూడ చిత్రపురి కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. జ్యోతి పలు సినిమాల్లో హాస్య సన్నివేశాల్లో, సహాయ పాత్రల్లో నటించింది.

 Character Artiste Banda Jyothi Dies

మంచి హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మెల్లగా కోలుకుంటున్న ఆమెకు గుండెపోటు వచ్చిందని, అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

బండ జ్యోతి విజయరామరాజు, కళ్యాణరాముడు, అందగాడు, స్వయంవరం, తోకలేని పిట్ట, భద్రాచలం, గణేష్ ఊర్మిళ డైరీ, s.p శంకర్ వంటి పలు తెలుగు సినిమాల్లో తనదైన కామెడీని పండించారు. ఆమె మృతిపట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

English summary
Noted character artiste Banda Jyothi breathed her last on Friday night in her apartment in Chitrapuri Colony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X