చరణ్, అల్లు అర్జున్ ల మెగా డబుల్ దమాకా...'చరణ్-అర్జున్’...!
మల్టీస్టారర్లు రావడం లేదని మొత్తుకుంటున్న మన చిత్ర సీమలో దానికి మళ్లీ బీజం వేస్తున్నారు మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి ఒక చిత్రంలో హీరోలుగా నటించడానికి అంగీకరించారు. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి వంశీ పైడిపెల్లి దర్శకత్వం వహిస్తాడు. లైన్ ఒకే అయిన ఈ సినిమాకి ప్రస్తుతం కథా చర్చలు జరగుతున్నాయి.
జూ ఎన్టీఆర్ 'బృందావనం" సినిమాతో సక్సెస్ అయిన వంశీ ఈసారి అంతకంటే భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలని ఒప్పించి సినిమా తీసేందుకు సమాయత్తమవుతున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, దిల్ రాజుతో కలిసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేముందు చరణ్ 'రచ్చ" పూర్తి చేస్తాడు. అలాగే అల్లు అర్జున్ ముందుగా త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తాడు. కథ పూర్తి గా సిద్దమై, అన్ని కుదిరితే అక్టోబర్ కల్లా ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేస్తారు. సెట్స్ మీదకి వెళ్లితే బహుశా సినిమా టైటిల్ 'చరణ్ అర్జున్" గా తీస్తారని సమాచారం. అదేగనుక నిజమైతే అటు డాన్సింగ్ లోనూ, ఇటు ఫర్ ఫామెన్స్ లోనూ ఆరితేరిన ఈ స్టార్స్ ఇద్దరికీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ హిట్ సినమాగా తిరగుడందని ఆశిద్దాం..


Click it and Unblock the Notifications











