»   » వాటే క్రేజీ కంబో బాస్..! "చరణ్ అర్జున్" గా మెగా మల్టీస్టారర్

వాటే క్రేజీ కంబో బాస్..! "చరణ్ అర్జున్" గా మెగా మల్టీస్టారర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్-స్టైలిష్ స్టార్ ఇద్దరూ కలిసి ఎవడు సినిమాలో చేశారు. ఇందులో బన్నీది చిన్న రోల్. అయితే ఈ మెగా హీరో్స ఒక్క ఫ్రేమ్ లో కూడా పక్కపక్కన కనిపించరు. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ మూవీ ఏ స్థాయి హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్- అల్లు అర్జున్ లతో ఓ మల్టీ స్టారర్ రెడీ అయిపోతోందని ఇండస్ట్రీ టాక్.

ఇంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఈ సారి ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్ రాసేసుకునే పనిలో పడిపోయాడట కూడా. ఈ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్రముఖనిర్మాణసంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ భారీ వ్యయంతో నిర్మించనున్నారని తెలిసింది.. అలాగే ఈచిత్రానికి చరణ్‌-అర్జున్‌ అనే టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారట..

Charan Arjun Multi starrer Movie?

అయితే దీనిపై మెగా హీరోల నుంచి గానీ, అల్లు అరవింద్‌నుండి గానీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలవడలేదు.. గతంలో బన్నీ, చరణ్‌లు పలు సందర్భాల్లో సరైన స్క్రిప్టు దొరికతే కలిసి నటించటానికి సిద్ధమని చెప్పటాన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈప్రాజెక్టు ఓకే అయ్యే అవకాశాలు లేకపోలేదు.. ప్రస్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చరణ్ ఓ సినిమా చేస్తుండగా, అల్లు అర్జున్ కూడా వ‌క్కంతం వంశీ సినిమాతో బిజీ కానున్నాడు.

ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌ర్వాతే క్రేజీ కాంబో సినిమా సెట్స్‌లోకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌న్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ రెండు సినిమాలు ఒకే సమయానికి పూర్తవుతాయట. ఇవి కంప్లీట్ కాగానే.. వీళ్లిద్దరి మల్టీ స్టారర్ మొదలైపోనుందని చెబుతున్నారు. ఈ మూవీలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ.. హీరోలిద్దరూ కలిసి కనిపించనుండడమే అసలు సిసలైన స్క్రీన్ ప్లే స్పెషాలిటీ అని ఇన్ సైడ్ టాక్.

English summary
It has been a long time wish of mega fans to see the combo of Ram Charan and Allu Arjun in a movie. Hitherto, Allu Arjun played a cameo role in Ram Charan's super hit film 'Yevadu'. But then, both the stars are hoped to team up for a full-fledged multi-starrer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu