»   » కాల్ చేయండి: ‘ఎవడు’ ప్రీమియర్ షో, టికెట్ రూ. 500

కాల్ చేయండి: ‘ఎవడు’ ప్రీమియర్ షో, టికెట్ రూ. 500

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం రేపు(జనవరి 12)న గ్రాండ్‌గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నిర్మాతలు ఈ రోజు (జనవరి 11) రాత్రి 9 గంటలకు స్పెషల్ పేయిడ్ ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. ఈ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని మల్లేపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విరాళంగా ఇవ్వనున్నారు.

మెగా ఫ్యామిలీ పీఆర్‌ఓ ఎస్‌కెఎన్ ఈ పేయిడ్ ప్రీమియర్ షో వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఎవడు మూవీ స్పెషల్ పేయిడ్ ప్రీమియర్ షో జనవరి 11 రాత్రి 9. గంటలకు శ్రీరాములు థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. టిక్కెట్ల కోసం 7799336644 నెంబర్‌కి కాల్ చేయండి. ఒక్కో టిక్కెట్ ధర రూ. 500. ఈ షో ద్వారా వచ్చే మొత్తాన్ని మల్లేపల్లిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి విరాళంగా ఇవ్వనున్నాం' అని ట్వీట్ చేసాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి 'ఎవడు' చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. వీరు ఈచిత్రంలో ఓ 15 నిమిషాల పాటు కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్యాం కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేసారు. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Mega Power Star Ram Charan Teja's much-awaited movie Yevadu, which has been delayed for long time, is all set for a grand worldwide release on January 12. The producers have planned a special paid premiere for the film at 9 pm tonight (January 11) and its complete collection will be donated to the construction of Lord Venkateswara Swami temple in Mallepally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu