»   » హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చరణ్ రాజ్ కొడుకు

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చరణ్ రాజ్ కొడుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దక్షిణాది నటుడు చరణ్ రాజ్ తన కొడుకు తేజ్ రాజ్‌ను త్వరలో హీరోగా వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో దాదాపు 300 చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించిన చరణ్ రాజ్ త్వరలో తన వారసుడిని సీని రంగంలోకి దింపబోతున్నాడు.

ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఇన్ని రోజులు తన కొడుకు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, డాన్స్, స్టంట్స్‌లోనూ అదరగొడతాడు. త్వరలో ఓ మంచి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు' అన్నారు.

Charan Raj and Tej Raj

'ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. పోటీని తట్టుకుని నిలబడినప్పుడే ఎవరి ప్రతిభ అయినా బయట పడుతుంది. పోటీ ఉందని బాధ పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తన కొడుకు పోటీ పడటానికే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. నిలదొక్కుంటాడనే నమ్మకం ఉంది' అన్నారు.

సినీ పరిశ్రమలో రాణించాలంటే గురువు అనే వాడు ఎంతో ముఖ్యం. నేను నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎన్నో తప్పటడుగులు వేసాను. కానీ నా కొడుకు అలాంటి తప్పలు చేయకుండా మెంటర్ గా అతన్ని ముందుకు నడిస్తాను' అని తెలిపారు చరణ్ రాజ్.

English summary
Popular actor Charan Raj, who has worked in over 300 films in Tamil, Telugu, Malayalam, Hindi and Kannada, is all set to introduce his son Tej Raj in filmdom. The actor says the youngster is ready to take the plunge under his guidance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu