»   » రామ్ చరణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ.... ఇప్పుడు సూపర్ పోలీస్ అట

రామ్ చరణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ.... ఇప్పుడు సూపర్ పోలీస్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చరణ్ తాజా చిత్రంగా వచ్చిన 'ధ్రువ'కి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, కోలీవుడ్ లోను మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళ్ నుంచి వచ్చిన రీమేకే అయినా కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, పోల్చి చూసిన తమిళులూ కూడా రామ్ చరణ్ కోసం సినిమా చూడటానికి ఎగబడుతున్నారట. పోలీస్ ఆఫీసర్ గా అక్కడి ప్రేక్షకులను చరణ్ కట్టిపడేశాడు. ఆ పాత్రలో ఆయన చూపిన నటనకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. దాంతో గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన 'జంజీర్' సినిమాను అక్కడ డబ్ చేయడానికి నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

Toofan

మెగా పవర్ స్టార్ కెరీర్ లో ఫ్యాన్స్ కూడా గుర్తుంచుకోలేని మూవీ తుఫాన్. హిందీ మూవీ జంజీర్ ను గా అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేయగా తెలుగులో తుఫాన్ గా ఈ చిత్రం విడుదలైంది. ఇఫ్పుడీ సినిమా తమిళ్ లోకి సూపర్ పోలీస్ పేరుతో డబ్ అవుతోంది. ప్రధానంగా చెర్రీతో పాటు జంటగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించడం అసలు కారణంగా చెప్పచ్చు. ఈ సినిమాను తమిళ్ లోకి సూపర్ పోలీస్ గా డబ్బింగ్ చేస్తుండగా.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయట.

అప్పట్లోనే రిలయన్స్ బిగ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ పోలీస్ గా తమిళ్ లోకి తీసుకెళుతున్నారు నిర్మాతలు. డిసెంబర్ లోనే సూపర్ పోలీస్ గా తమిళంలో చెర్రీ సత్తా చాటబోతున్నాడట. అక్కడ ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

English summary
Apparently Charan's biggest flop "Toofan" (Zanjeer 2.0) is now getting dubbed into Tamil as "Super Police". Generally if a hero scores hit with one film, then his past films dubbed this way. But here in Charan's case, somehow Tamil distributors are betting big on this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu