For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓన్లీ అమ్మాయిలకే.. :బైక్ పై సందీప్ కిషన్ వెనక కూర్చోవాలి ఉంటే,ఇదిగో

  By Srikanya
  |

  హైదరాబాద్ : హీరో సందీప్ కిషన్ తన తాజా చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప' ప్రమోషన్ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ప్రమోషన్ కోసం తన ఫాన్స్ తో పాటు హర్లే డేవిడ్ సన్‌ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులలో ఒక అనాథశ్రమానికి వెళ్లి అనాధ పిల్లల తో ఒక రోజంతా గడుపుతారట.

  అయితే ఆ బైక్ లో వెనక కూర్చోవాలంటే లేడీ అభిమానుల కోసం సీట్లను వేలం పెట్టారు.ది గ్రేట్ ఫ్యాన్ అనే వెబ్ సైట్ కు వెళ్లి ఆన్‌లైన్‌ వేలం పాట లో పాల్గొనాలి. అలా వచ్చిన డబ్బంతా అనాధలకు డొనేట్ చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే సందీప్‌ వెనకాల సీట్ ఫీమేల్‌ ఫ్యాన్ప్‌కు మాత్రమేనంట. అమ్మాయిలు మాత్రమే బిడ్ చేయాలి.

  హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ''ది గ్రేట్ ఫ్యాన్.కామ్ ద్వారా బైక్ పై నాతో కూర్చొని ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసే అవకాశాన్ని ఓ అమ్మాయికి ఇస్తున్నాం. ఆక్షన్ పద్ధతిలో ఆ సీట్ కొనుక్కోవలసి ఉంటుంది. ఆ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులను ఓ అనాథశ్రమానికి డొనేట్ చేస్తాం. దీని వల్ల కొంత మంది అనాథలకు తిండి, చదువు దొరుకుతుందని భావిస్తున్నాం. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల సపోర్ట్ మాకు ఎంతో అవసరం'' అన్నారు.

  అలాగే కథ గురించి చెప్తూ... హైదరాబాద్ లోని హైటెక్ ఫ్లై ఓవర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ఫ్లైఓవర్ పై ఓ బాంబ్ ఉంది. ఆ విషయం తెలియక ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ కథ జరుగుతుంది. వారు అక్కడ నుండి ఎలా తప్పించుకున్నారనేదే కథ. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. థ్రిల్లింగ్ గా ఉంటుంది. కథను నమ్మి చేసిన సినిమా అన్నారు.

  చోటా కె.నాయుడు మాట్లాడుతూ '' ఈ సినిమా కోసం ఆరు నెలలు కష్టపడ్డాం. సినిమా జూన్ 10న విడుదలవుతుందంటే కొంత టెన్షన్ గానే ఉంది. తప్పకుండా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అన్నారు.

  CharityInStyle Sundeep Kishan's new promotion

  చిత్ర దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ''నేను రచయితగా చాలా సినిమాలకు పనిచేశాను. దర్శకుడిగా నా తొలి చిత్రమిదే. టెన్షన్ గా ఉంది. జూన్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సందీప్ కిషన్ నన్ను నమ్మి మూడేళ్లు నాతో పాటు ట్రావెల్ అయ్యారు. అలాగో చోటా కె.నాయుడుగారు కెమెరా మాంత్రికుడు ఆయన సినిమాను చిత్రీకరించి స్టైల్ చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.

  చాలా సంవత్సరాలు పాటు ఈ సినిమా కథను మెటీరియలైజ్ చేయలేకపోయాను. అందుకు కారణం నాకు చోటాగారి వంటి వ్యక్తి దొరకలేదు. రాయడానికి, తీయడానికి కొద్దిగా కష్టమైన స్క్రిప్ట్. కానీ చోటాగారు సపోర్ట్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. మిక్కి జె.మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా భార్య శశి జ్యోత్స్న మూడు పాటలు రాయగా, కృష్ణచైతన్య, మీగడ రామలింగంగారు మంచి సాహిత్యాన్ని అందించారు.

  ఇక టైటిల్ విషయానికి వస్తే మన ప్రతిజ్జ్ఞను తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు. ఓ చిన్నపిల్లాడు తన అమాయకత్వాన్ని చాటుకున్న పద్ధతినే టైటిల్ గా మార్చుకున్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. అలీగారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వి తమ కామెడితో అందరినీ ఎంటర్ టైన్ చేయబోతున్నారు. సందీప్ కిషన్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది.

  ఇక నిత్యామీనన్ క్యారెక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుంది. సందీప్ కిషన్, చోటాగారి సపోర్ట్ తోనే ఈ సినిమా రూపొందింది. సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

  సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. జూన్ 10న సినిమా విడుదలవుతుంది.

  సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులునటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: ఛోటాకె.నాయుడు,

  ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కిజె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ.

  తమ అభిమాన హీరో సందీప్ కిషన్ బైక్ వెనుక కూర్చుని వెళ్లాలని ఉన్న అమ్మాయిలకు ఓ సదవకాసం. అలాంటి ఆసక్తి ఉన్న అమ్మాయిలు, ఈ స్టోరీలో ఇచ్చిన లింక్ లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. ప్రమోషన్ కోసం తన ఫాన్స్ తో పాటు హర్లే డేవిడ్ సన్‌ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులలో ఒక అనాథశ్రమానికి వెళ్లి అనాధ పిల్లల తో ఒక రోజంతా గడుపుతారట.అక్కడ నుంచి అదృష్టవంతులకు ఆ అవకాసం వరిస్తుంది.

  English summary
  Sundeep Kishan is promoting a great cause through ‪#‎CharityInStyle‬. The fans can auction their way to an ultimate Chance to Ride on Super Bikes with Sundeep Kishan to help girls orphanage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X