»   » 'సై ఆట' లో కొత్త అనుభూతి... చార్మి

'సై ఆట' లో కొత్త అనుభూతి... చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ గా మళ్ళీ తన పూర్వవైభవాన్ని 'సై ఆట' చిత్రం తెచ్చిపెడుతుందని, తనకు ఈ చిత్రం మంచి విజయాన్ని ఇస్తుందనే చెప్తోంది చార్మి. కొంత కాలం నుంచి సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా వుంటున్న చార్మి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'సై ఆట'. కె.ఆర్‌.కె.పవన్‌ దర్శకత్వంలో నల్లూరి రాజశేఖర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. ఇటీవలే పాటలు విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ విషయాన్ని చార్మి ప్రస్దావిస్తూ...."నేను చేసిన చిత్రాల్లో ఇది కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా సంగీతానికి బాగా ప్రాధాన్యమున్న చిత్రం. చిన్నపిల్లలతో కలిసి స్టెప్స్‌ వేస్తున్నప్పుడు కొత్త అనుభూతికి లోనయ్యాను' అని చెప్పారు చార్మి. నిర్మాత మాట్లాడుతూ-"సంగీత యువ కెరటం దేవి అందించిన బాణీలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి పాటను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మ్యూజిక్‌ చార్ట్‌ బస్టర్స్‌లో టాప్‌ ప్లేస్‌లో మా పాటలు వుండటం ఆనందంగా వుంది. చార్మిని సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఇప్పటి వరకు చార్మి చేసిన చిత్రాల్లో కెల్లా ఇది ఎంతో భిన్నంగా వుంటుంది. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -"నేటి తరం అమ్మాయిలకు రోల్‌ మోడల్ ‌గా నిలిచే పాత్రను చార్మి ఈ చిత్రంలో చేశారు. యాక్టివ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ అమ్మాయిగా ఆ పాత్ర అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది' అని తెలిపారు. రావు రమేష్‌, డాక్టర్‌ శివ ప్రసాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాష శ్రీ, కెమెరా: జె.ప్రభాకర్‌ రెడ్డి, నిర్మాణ నిర్వహణ: దేశినేని శ్రీనివాస్‌, సమర్పణ: కాణిపాకం క్రియేషన్స్‌, నిర్మాణం: ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu