»   » చార్మి నిద్రలేని రాత్రిళ్ళు గురించి...

చార్మి నిద్రలేని రాత్రిళ్ళు గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ స్టార్ చార్మికి రాత్రిపూట పడుకున్నా నిద్రపట్టటం లేదంటోంది. ఎందుకూ అంటే...."ఇటీవల 'మంగళ' సినిమా స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. మొదటి రోజు బాగానే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నాలో నాకు తెలియని భయం ఏదో మొదలైంది. రాత్రిపూట పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఏదో తెలియని కంగారు" అంటూ చెప్పుకొచ్చింది. అయితే సబ్జెక్టు గురించా అంటే..."ఈ పరిశ్రమలో ఏ ప్రాజెక్టుకు సంబంధించయినా అంచనాలు పెంచుకోవడం సులువే. విజయాలు మాత్రం తేలిగ్గా దక్కవు. మనం ఊహించినది అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. ఈ విషయాన్ని నేను బాగా నమ్ముతాను. కానీ ఓ సినిమా ఒప్పుకొని సంతకం పెట్టాక అందులో మనస్ఫూర్తిగా నటిస్తాను" అంటోంది. ఇక చార్మి..మంత్ర దర్శకుడుతో చేస్తున్న రెండో చిత్రం 'మంగళ'. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు తులసీరామ్ మళ్ళీ చార్మితోనే హర్రర్ చిత్రాన్ని ప్రారంభించారు. ఇంతకు ముందు ఆయన ఎమ్.ఎస్.రాజు కుమారుడుతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ మేరకు కథా కూడా ఫైనలైజ్ అయి చివరి నిముషంలో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu