Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లవ్ ప్రపోజల్స్,పెళ్లి గురించి చార్మి
తనకి లవ్ మ్యారేజే అవకాసం ఉందని చెప్తూ... నా తత్వానికి అరేంజ్డ్ మ్యారేజ్ కష్టం. నాకు ఆ వ్యక్తి గురించి బాగా తెలియాలి. ముఖ్యంగా అతనికి నా ప్రొఫెషన్ గురించి తెలియాలి. ఎందుకంటే నా ప్రొఫెషన్‌లో టైమింగ్స్ ఉండవు. అవుడ్డోర్‌లు వెళ్తుండాలి. అలాగే చిన్న చిన్న డ్రెస్‌లు వేసుకోవాల్సి వస్తుంది. అందుకే నా లైఫ్ స్టయిల్‌ని అండర్‌స్టాండ్ చేసుకున్నవాళ్లతోనే నేను ఉండగలను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు భయం కూడా. సడన్‌గా కొత్త వ్యక్తితో జీవితం ఎలా? నా గురించి బాగా తెలిసినవాళ్లయితేనే బావుంటుంది అంది.
అలాగే నేను మనిషినే కదా! నాకూ ఓ మనసుంటుంది. దానికీ స్పందన ఉంటుంది. అలాగని అందర్నీ ప్రేమించేయలేం. అయినా ఇప్పుడు నా వయసు 24ఏళ్లు. పెళ్లి కబుర్లకు ఇంకా చాలా టైముంది అంది. ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనే విషయం గురించి చెప్తూ... చూస్తున్నారు కాదు, వస్తున్నాయి. బోలెడుమంది తెలుగువాళ్లు, పంజాబీలు, ఇద్దరు ముగ్గురైతే నాకు బాగా తెలిసినవాళ్లు మా ఇంటికొచ్చి మరీ అమ్మా నాన్నతో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట్లాడారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ, ఈ ఏడాది అయితే మాత్రం ఉండదు అని తేల్చి చెప్పింది.