»   » బూడిదా బూడిదా రాసుకుంటే అన్నట్లు చార్మి, శ్రీకాంత్

బూడిదా బూడిదా రాసుకుంటే అన్నట్లు చార్మి, శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరస ఫ్లాఫుల్లో ఉన్న చార్మి తాజాగా శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం కమిటయ్యింది. ఇంతకుముందు కౌసల్యా సుప్రజా రామ చిత్రంలో హీరోయిన్ గా చేసిన చార్మి 'సేవకుడు'లో శ్రీకాంత్ ప్రక్కన చేయనుంది.హిట్టు,ప్లాపులకు సంభందం లేకుండా వరస చిత్రాల దర్శకుడు వి.సముద్ర ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ కాంబినేషన్ పై విచిత్రమైన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. శ్రీకాంత్ నటించిన నగరం, కౌసల్యా సుప్రజా రామా, మహాత్మా, అఆఇఈ చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. అలాగే చార్మి చిత్రాలు వరసగా కావ్యాస్ డైరీ, మనోరమ, మహాత్మ, ఇందు ఫ్లాప్ కావటం జరిగింది.దర్శకుడు సముద్ర విషయానికి వస్తే జగపతి బాబుతో అధిపతి, భూమికతో మల్లెపూవు అనే బారీ డిజాస్టర్ చిత్రాలు తీసి ఉన్నాడు. దాంతో ఇంత భారీ ఫ్లాపుల కాంబినేషన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ‌లో సేవకుడు చిత్రీకరణ సాగుతోంది.ఇక శ్రీకాంత్ జీవా దర్శకత్వంలో రంగా..ది దొంగ అనే చిత్రం చేస్తున్నారు. చార్మి నటించిన సయ్యాట చిత్రం అతి త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.దర్శకుడు సముద్ర విషయానికి వస్తే అతను డైరక్ట్ చేసిన అనూష్క..పంచాక్షరి చిత్రం వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ అవనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu