»   » సహాయం చిన్నదే కావచ్చు కానీ ఆలోచన గొప్పదే... క్యాన్సర్ బాదిత చిన్నారుల కోసం చార్మి

సహాయం చిన్నదే కావచ్చు కానీ ఆలోచన గొప్పదే... క్యాన్సర్ బాదిత చిన్నారుల కోసం చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య పొట్టి జుట్టు ఫ్యాషన్ మళ్ళీ మొదలయ్యింది... అందాల సుందరంగులంతా జుత్తు కత్తిరించుకొని హొయలు పోతున్నారు....సమంతా,శృతీహసన్,హన్సిక ఇలా ఒక్కొక్కరే కొప్పులు సవరించుకున్నారు. పొట్టిజుట్టు తో సెల్ఫీలు దిగి కుర్రాళ్ళని మరింత రెచ్చగొడుతున్నారు.

లేటెస్ట్ గా ఈ బ్యాచ్ లో చార్మి కూడా కూడా చేరిపోయింది. పవర్ స్టార్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా ఆమధ్య షార్ట్ హెయిర్ తోకనిపించింది అయితే అప్పుడు రేణూ.., ఇప్పుడు చార్మీ ఈ ఇద్దరూ మాత్రం జుట్టు కత్తిరించుకున్న కారణం వేరు. క్యాన్సర్ పేషంట్ల కోసం విగ్గులు తయారు చేసేందుకు తన జుట్టుని విరాళంగా ఇవ్వటానికే వీళ్ళు తమ పొడవైన జుట్టుని తీసేసారు.

charmi

బాలీవుడ్ మూవీ 'దో ల‌ఫ్జోంకీ క‌హానీ' లో అంధురాలిగా నటించిన కాజల్ మరణానంతరం తన కళ్లను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. అంతగా ఆమెని కదిలించిందా పాత్ర. ఇప్పుడు హీరోయిన్ ఛార్మీ తన జుట్టు కత్తిరించుకుంది. అది ఫ్యాషన్ కోసమో, ఏదైనా మూవీలో కేరక్టర్ చేయడానికో కాదు. ఓ మంచి పనికోసం హెయిర్ కట్ చేసుకుంది. టీనేజ్ లో ఉన్న ఇద్దరు కేన్సర్ రోగులకు జుట్టు లేదు. వాళ్లు విగ్గు చేయించుకునేందుకు తన జుట్టును కత్తిరించుకుంది ఛార్మీ.

charmi

ఓ ఇద్దరు టీనేజ్ అమ్మాయిల్ని ఓసారి వచ్చి చూసిపొమ్మని, వాళ్లు నీ ఫ్యాన్స్ అని ఛార్మీ స్నేహితురాలు ఓసారి పిలిచిందట. ఎందుకోనని వెడితే అక్కడ ... ఇద్దరు క్యాన్సర్ రోగులు కనబడ్డారట. కీమో థెరపీలో భాగంగా వాళ్ల జుట్టు మొత్తం తీసేశారు. ఛార్మీని చూడగానే వాళ్లు... ఛార్మీ అక్కా! నీ జుట్టు చాలా బాగుంది అన్నారు. వాళ్ల మాటలు విన్న ఛార్మికి కళ్లలో నీళ్లు తిరిగాయట.

ఆ అమ్మాయిల్ని చూశాక ఛార్మి ఒక నిర్ణయానికి వచ్చి... తన హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్లింది. తన హెయిర్ తో ఆ అమ్మాయిలకు విగ్ లు చేయించి గిఫ్ట్ గా ఇవ్వడానికి జుట్టు కత్తిరించుకుంది. ఆ జుట్టు పొడవు 18 అంగుళాలు. ఆ హెయిర్ తో రెండు విగ్గులు తయారు చేయవచ్చట. ఈసారి ఆ పిల్లల్ని కలిసినప్పుడు ఆ విగ్గుల్ని ఇస్తుందట ఛార్మి. ఇప్పుడు నిజంగా చార్మీ మరింత అందంగా కనిపిస్తోంది...

English summary
Charmi has cut her hair and now sporting a new hairdo. And no, it’s not for any role in her upcoming films, but Charmi did it for a cause. she has decided to chop her locks as she wanted to get wigs made out of her for two cancer patients..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu