»   » సింగర్ సునీత పాటకు....చార్మి ఆట..!

సింగర్ సునీత పాటకు....చార్మి ఆట..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదనపు ఆదాయం పొందడానికి యు.ఎస్ లో స్టేజ్ షోలు ఇవ్వడం ఈమధ్య కాలంలో మన తారలకు, సింగర్లకు బాగా అలవాటైంది. ముఖ్యంగా యువ గాయనీగాయకులు ఈమధ్య ఇలాంటి టూర్లు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్లల్లో సునీత కూడా ఉంటోంది. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సునీతకు ప్రవాసాంధ్రులలో కూడా చాలా మంది అభిమానులున్నారు. అందుకే, ప్రతి ఏడాది యు.ఎస్. టూర్ కి వెళుతోంది. గత ఏడాది చేసిన టూర్ లో తను పాడుతుంటే, అందాల తార శ్రియ డ్యాన్స్ పెర్ఫాం చేసింది. అలాగే, ఈ ఏడాది కూడా వచ్చే జూలైలో సునీత తన యు.ఎస్. టూర్ ని ప్లాన్ చేసుకుంది. ఈసారి ఆమె టీంలో కథానాయిక చార్మి చేరుతోందట. సినిమాలు ఎలాగూ లేవు కాబట్టి ఈవిధంగా వర్కౌట్ చేసుకుంటున్నారన్న మాట..!

English summary
Sunitha renowned Telugu playback singer and dubbing artist will be touring USA this year also.She debuted as a playback singer with the song, "EeVelalo" in the film Gulabi in the year 1995.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu