For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఛార్మి

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఛార్మి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పింది. ఆమె ఎక్కిన ప్లైట్ కు సాంకేతిక లోపం రావటంతో ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురి అయ్యారు. ఈ రోజు ఉదయం వైజాగ్ వెళ్ళడం కోసం ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణమయ్యారు ఛార్మి. కాసేపట్లో లాండింగ్ అవుతుందనగా అనుకోని ప్రమాదం ఎదురైంది.అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకుండా బయిటపడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియచేసింది.

  వివరాల్లోకి వెళితే...

  ఛార్మి ట్వీట్ చేస్తూ.... "ఒక్కసారిగా 100 అడుగుల కిందకు ఫ్లైట్ పడిపోయినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. నా టీ కింద పడింది. ప్రయాణికులు అందరూ కింద పడిపోయారు. ఇదే చివరి రోజు అనుకున్నాం. మరోసారి ఫ్లైట్ లో కుదుపులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రాణాలు పోయాయి అనుకున్నా. ఇదే చివరి శ్వాస అని ఫీల్ అయ్యాను. కాని ఎం కాలేదు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. ఇంకా షాక్ లోనుండి తేరుకోలేదు. నెలపై దిగాం అనే విషయాని నమ్మలేకపోతున్నాను" అన్నారామె

  Charmi

  అలాగే...ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదించాలి అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆమె మంత్ర 2 చిత్రం చేస్తోంది. ఇల్లు అమ్ముకుందామంటే దెయ్యం ఉందంటూ కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఆ ఇంట్లోనే ఉన్న అమ్మాయి 'మంత్ర'గా చేసింది ఛార్మి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా 'మంత్ర2'లో కనిపిస్తుంది. ఫ్లెక్స్‌ హౌస్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా కోసం రాత్రి వేళల్లో సన్నివేశాలను చిత్రీకరించిన సన్నివేసాలు హైలెట్ అంటున్నారు. ఎస్వీ సతీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వై.యాదగిరి రెడ్డి, పి.శౌరి రెడ్డి నిర్మాతలు.

  పెళ్లి గురించి మాట్లాడుతూ... ''అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. పాతికేళ్లొస్తే పెళ్లి చేసుకోవాల్సిందేనా? నలభయ్యేళ్లకి కూడా చేసుకోవచ్చు. కెరీర్‌ని చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇదే సరైన సమయం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనేమీ లేదు '' అని వివరించింది.

  ఇక ''తెరపై ఎలాంటి పాత్రల్లోనైనా కనిపించొచ్చు. అయితే ఇదివరకు నాకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఓ హీరోయిన్ ని ఎలా చూపిస్తున్నాం? ఎలాంటి దుస్తులు వేయిస్తున్నాం? అని కూడా ఆలోచించకుండా సినిమాలు తీశారు. అవి టీవీల్లో వస్తున్నాయంటే వెంటనే కట్టేస్తాను. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదనే దర్శకుల విషయంలో పక్కాగా ఉంటాను. మాట మీద కట్టుబడి సినిమా తీస్తానంటేనే ఒప్పుకొంటుంటా'' అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.

  English summary
  Charmi tweeted “In vizaak .. Had the most scary experience on my indigo flight .. Looks like flight dropped dwn suddenly for few 100 feet ,not only my tea but all flew up in d air … I really thought this was THE END .. Den flight dropped agn ,n i was sure this was my LAST BREATH ..But no .. I m safe but still not able to believe tat I M ON GROUND !! V never know ,so LETS JUST LIVE IT FULLY !!!” she tweeted
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X