»   » చార్మికి అది చూసుకునే అంత ధీమా

చార్మికి అది చూసుకునే అంత ధీమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చార్మి కెరిర్ దాదాపు ముగింపు దశకు వచ్చేసినట్లే అని,నగరం నిద్రపోతున్న వేళ, మాయగాడు డిజాస్టర్స్ దాన్ని ప్రూవ్ చేసాయని టాలీవుడ్ టాక్. అయితే చార్మి మాత్రం తన వెలుగు ఇప్పుడే స్టార్టయింది అంటోంది. బాలీవుడ్ లోకి బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంతో ప్రవేశించిన ఆమెకు అక్కడ ఆఫర్స్ ప్రారంభయ్యాయని చెప్తోంది.రీసెంట్ గా ఆమెకు జిల్లా ఘజియాబాద్ చిత్రంలో ఆఫర్ వచ్చింది. అది ఒక్కటే కాక మరిన్ని లైన్ లో ఉన్నాయని చెప్తోంది. అలాగే ఆమె సంజయ్ దత్, వివేక్ ఒబరాయ్ వంటి వారు చేస్తున్న ఈ చిత్రంలో కామిక్ రోల్ చేస్తోంది.

జిల్లా ఘజియాబాద్ సినిమా హిట్టయితే మంచి మైలేజి దొరుకుతుందని ఆశిస్తోంది. మరో ప్రక్క పూరీ జగన్ కూడా ఆమెకు బెంగపడాల్సిన పనిలేదని బాలీవుడ్ లో ఆమెను నిలబెట్టే పూచీ నాదని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. దొంగలముఠాలో తనకు ఆఫర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ కూడా బాలీవుడ్ నే అంటిపెట్టుకుని ఉండటంతో ఆమె తనకు ఆఫర్స్ రావనే భయం లేదని అంటోంది. తెలుగు సినిమా నుంచి హిందీకి ఎదిగానంటోంది కానీ ఇక్కడ ఆఫర్స్ రాక అక్కడ ట్రై చేస్తున్నాని చెప్పటం లేదు.దటీజ్ చార్మి.

English summary
After being noticed for her role in Buddha Hoga Terra Baap, Charmi has now signed another big-ticket Hindi film, Zilla Ghaziabad.The movie will show the comic side of the curvy actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu