»   »  ఛార్మి సినిమాలో మహేష్ గెస్ట్?

ఛార్మి సినిమాలో మహేష్ గెస్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu
మహేష్ బాబు సోదరి మంజుల నిర్మించనున్న ఓ చిన్న బడ్జెట్ సినిమాలో ఛార్మి ని హీరోయిన్ గా ఎంపికచేసారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమా మంత్ర తరహాలో సస్పెన్స్ ఎలిమెంట్ ప్రధానంగా రూపొందనుందని తెలిసింది. అయితే ఈ సినిమాలో గెస్ట్ గా మహేష్ గెస్ట్ గా కనిపించే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మహేష్ తో మంజుల తీసిన 'నాని'సినిమా డిజాస్టర్ ఫలితాన్ని భాక్సాఫీస్ వద్ద నమోదు చేయటంతో ఈ సహకారం అందించనున్నారని అంటున్నారు.

అందులోనూ త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమా రిలీజ్ కావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని ఉన్నారని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా రెండు చిత్రాల్లో (చింతకాయిల రవి, నేనింతే) అతిధి పాత్ర వేస్తున్నాడని కాబట్టి ఇది ఓ కొత్త ట్రెండు అని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ తో మంజుల ..సూపర్ గుడ్ వారితో కలసి పూరితో సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X