»   » ఆ పెద్ద హీరోల కంటే ఛార్మి చాలా బెటర్....

ఆ పెద్ద హీరోల కంటే ఛార్మి చాలా బెటర్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా జ్యోతి లక్ష్మి. జూన్ 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురువైన రామ్ గోపాల్ వర్మకు స్పెషల్ షో చూపించారు పూరి జగన్నాథ్.

జ్యోతి లక్ష్మి సినిమాలో హీరోయిన్ చార్మి పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘జ్యోతి లక్ష్మి సినిమా చూసాను. మెసేజ్ అండ్ బ్యూటీ పర్ ఫెక్ట్‌గా మిక్స్ చేసి తీసారు. దాంతో పాటు ఎంటర్టెన్మెంట్ కూడా అదిరిపోయింది. చార్మి పెర్పార్మెన్స్ సూపర్. జగన్ చార్మిని చాలా బాగా చూపించాడు. పంచ్ లైన్స్, టెక్నికల్ స్టైలైజేషన్ బావుంది. చార్మి లుక్ చాలా హీరోయిక్ గా ఉంది. రియల్ ఎమోషన్స్. ఫేక్ హీరోయిజం అసలే లేదు. చాలా మంది పెద్ద హీరోల కంటే ఆమె బెటర్ అంటూ కామెంట్ చేసారు.


ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతి లక్ష్మీ'.


 Charmi is heroic than many heroes: RGV

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఛార్మి హీరోయిన్‌గా ‘జ్యోతి లక్ష్మీ' పేరుతో సినిమా చెయ్యబోతున్నామని దర్శకనిర్మాతలు ఎనౌన్స్ చెయ్యడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారో ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి.


బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాగా ‘జ్యోతి లక్ష్మి' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
“Saw Jyothilaksmi..A perfect mix of story and message and the beauty is that the message comes through a terrific massage of entertainment. Charmi in Jyothilakshmi is gorgeous and intensely innocent and is consistent both in her performance and character growth. The punch lines and technical stylisation of Jagan made Charmi look more heroic than many heroes because of real emotions and not fake heroism”, said Ram Gopal Varma.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu