»   » వేధించాడన్న నిర్మాతతో చార్మి కాంప్రమైజ్

వేధించాడన్న నిర్మాతతో చార్మి కాంప్రమైజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిర్మాత యలమంచి రవిచంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, వేధించాడని హీరోయిన్ చార్మి 'మా'కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు చార్మి తానో పెద్ద నటినన్న అహంతో సినిమా నిర్మాణంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురించేసిందనీ, మూడున్నర కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసి రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లోకి తనను నెట్టిందంటూ రవిచంద్ర సైతం నిర్మాతల మండలికి చార్మిపై ఫిర్యాదు చేశారు.అలా వివాదంతో ఆ చిత్రం విడుదల ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ వివాదం ముగిసినట్లుంది.చార్మితో నిర్మాత కాంప్రమైజ్ అయ్యాడని తెలుస్తోంది. చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాత ప్రకటించారు. వేణు, చార్మి జంటగా నటించిన చిత్రం 'మాయగాడు' చిత్రం ఈ నెల 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. చిత్రం హీరో వేణు ఈ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.

English summary
'Mayagadu' is the flick starred by Venu and Charmi as hero and heroine has completed shooting. This happens to be a love story based flick is getting ready for release on 15th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu