»   » చార్మి అర్ధరాత్రి పోరాటం (నగరం నిద్రపోతున్న వేళ ప్రివ్యూ)

చార్మి అర్ధరాత్రి పోరాటం (నగరం నిద్రపోతున్న వేళ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈరోజు చార్మి నటించిన నగరంలో నిద్రపోతున్న వేళ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రంలో చార్మి నిహారిక అనే రిపోర్టర్ గా కనిపించనుంది. నిబద్ధత కలిగిన ఆమె వృత్తిలో భాగంగా అర్ధరాత్రి వేళ రోడ్డుపైకి వస్తుంది. నగరమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఆమెకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడింది? తన వంతుగా సమాజానికి ఎలాంటి మేలు చేసింది? అనే విషయాల్ని తెరపైనే చూడాలి. శివరామ్‌ప్రసాద్‌ (జగపతి బాబు)తో నిహారికకు ఉన్న సంబంధమేమిటన్నది కూడా కథలో కీలకమే. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''సామాజిక రాజకీయ పరిస్థితుల్ని ఎండగట్టడమే ఈ కథ ఉద్దేశం. సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. కథలోని మలుపులు ఉత్కంఠ కలిగిస్తాయి. చిత్రంలో ఎక్కువ భాగాన్ని రాత్రి వేళల్లోనే చిత్రించామన్నారు.

చిత్రం: నగరం నిద్రపోతున్న వేళ
సంస్థ: గురుదేవ క్రియేషన్స్‌ ప్రై.లి.
నటీనటులు: జగపతిబాబు, చార్మి, పిళ్లా ప్రసాద్‌, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్‌, చంద్రమోహన్‌, బాబుమోహన్‌, ఉత్తేజ్‌, శివారెడ్డి తదితరులు
నిర్మాత: నంది శ్రీహరి
దర్శకత్వం: ప్రేమ్‌రాజ్‌

English summary
Jagapathi Babu, Charmi starrer ‘Nagaram Nidra Pothunnavela’ is all set to open in theaters on June 24th. Directed by Premraj and produced by Nandi Srihari, the unit has wrapped the post production. The film highlights a woman protagonist in Charmi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu