»   » బాగా భయపెడతా: చార్మి

బాగా భయపెడతా: చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసాధారణ స్క్రిప్టుతో తులసీరామ్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. 'మంత్ర' కంటే రెండు మెట్లు ఎక్కువగా ఈ సినిమా ఉంటుంది. 'మంగళ' పాత్రలో నన్ను నేనే చాలెంజ్ చేసుకుంటున్నా. ఇది బాగా భయపెట్టే సినిమా అంటూ చెప్పుకొచ్చింది చార్మి. తను తాజాగా చేస్తున్న 'మంగళ' అనే చిత్రం గురించి చెప్పుకొస్తూ. చార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. మంత్ర ఎంటర్ ‌టైన్ ‌మెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో ఓషో తులసీరామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చార్మిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ క్లాప్‌నివ్వగా, హీరో సాయిరాం శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

దీనికి 'ఆర్య' దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ "ఇదివరకు 'మంత్ర' బాగా ఆడటంతో షూటింగ్ ప్రారంభమవడానికి ముందుగానే 'మంగళ'కు మంచి హైప్ వచ్చింది. 'మంత్ర'కి 'మహా మహా..' పాట ఎంత ప్లస్సో, సంగీత దర్శకుడు విశ్వా అందించే రెండు పాటలు అలా ఈ సినిమాకి ప్లస్సవుతాయి" అన్నారు. దర్శకుడు తులసీరామ్ మాట్లాడుతూ "గ్రాఫిక్స్ లేకుండా 'మంత్ర' తీసిన నేను, గ్రాఫిక్స్‌ని ఉపయోగిస్తూ హారర్ ఫిల్మ్‌గా 'మంగళ' తీస్తున్నా. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. హైదరాబాద్, తలకోనలో చిత్రీకరణ జరుపుతాం" అని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu