For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛార్మి మంత్రం మరోసారి....

  By Srikanya
  |
  హైదరాబాద్ : చార్మీ ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. తేజ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే ఆ సినిమా పేరు 'మంత్ర 2'. ఈ చిత్రంతో ఎస్.వి. సతీష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాని బోనాల శ్రీకాంత్, రవితేజ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గ్రాఫిక్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. మిగిలిన నటీనటుల వివరాలు అతిత్వరలో వెల్లడిస్తారు.

  నిర్మాతలు మాట్లాడుతూ... ' ఇంతకుముందు వచ్చిన 'మంత్ర' సినిమాకి ఇది సీక్వెల్ మాత్రం కాదు. అయితే 'మంత్ర' తరహాలోనే ప్రేక్షకుల్ని అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా. హారర్, సస్పెన్స్ అంశాలు కలిగిన ఈ కథను వినగానే సింగిల్ సిట్టింగ్‌లోనే చార్మీ ఓకే చేసి, సినిమా చేస్తున్నానని చెప్పారు.

  ఇంతకు ముందు 'మంత్ర', ఇప్పుడు 'మంత్ర-2' .. ఇలా ఒక హీరోయిన్ సేమ్ టైటిల్‌తో రెండు సినిమాలు చేసిన దాఖాలాలు తెలుగు చిత్రపరిశ్రమలో లేవు. ఆ ఘనత మా హీరోయిన్ చార్మీగారికే దక్కుతుంది. మేం చెప్పిన కథని విని, మా మీద నమ్మకంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించిన చార్మీగారికి కృతజ్ఞతలు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా, భారీ సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మిస్తాం. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఆర్.పి.తనికెళ్ల, ఎడిటింగ్: బాబు, సహ నిర్మాత: సురేశ్ కొండవీటి, సమర్పణ: కె.పద్మ, నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, దర్శకత్వం: ఎస్.వి.సతీష్

  దాదాపు ఫేడవుట్ దశలో ఉన్న ఛార్మి ఇప్పుడు మరో చిత్రం కమిటై చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టుగా కనిపిస్తోంది. ఒడిశాలో చోటుచేసుకొన్న ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 'ప్రతిఘటన' అనే పేరుని నిర్ణయించారు. ఇందులో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తారని సమాచారం.

  ఛార్మి పోషించబోయేది పాత్రికేయురాలి పాత్ర. వర్తమాన సమాజంలో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు, రాజకీయాల నేపథ్యంగా సాగే కథ ఇది. ఇప్పటికే కథ సిద్ధమైంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. ఇటీవలి కాలంలో ఛార్మి హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు ఎక్కువగా చేస్తోంది. 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర', 'మంగళ', 'ప్రేమ ఒక మైకం' ఈ తరహావే. ఆ జాబితాలోకే 'ప్రతిఘటన' కూడా చేరుతుంది.

  మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ వంటి స్త్రీ ప్రధాన చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా ఏంటో ఇప్పటికే చాటారు చార్మి. ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం 'ప్రేమ ఒక మైకం' త్వరలో విడుదల కానుంది. అందులో ఆమె వేశ్య పాత్రతో మెప్పించబోతున్నారు.

  English summary
  
 Actress Charmi, who is seeking a hit in her career, is doing an offbeat film titled Manthra 2. After Anukokunda Oka Roju , the bubbly actress is said to have high expectations with this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X