హైదరాబాద్ : ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ముహూర్తం నిన్న జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సెక్సీ ఇమేజ్ ని షేర్ చేస్తూ ముహూర్తం జరిగిందని తెలియచేసింది. ఇది మెబైల్ ఫోన్ లో తీసిన ఫొటో.
ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా పూర్తవటంతో తన భవిష్యత్ సినిమాల పనిలో పడిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తెలిపాడు. తను ఛార్మీ తో తీయబోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్లడించాడు. అయితే ఈ సినిమా నర్తకి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామని వెల్లడించాడు.
పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.
Puri Jagan’s latest movie “Jyothi Lakshmi” featuring sexy siren Charmi Kaur in the lead, got kick started already. Though Charmi left for Chennai today, all of a sudden she shared a photograph clicked on mobile phone, claiming that as a shot from Muhurat event of “Jyothi Lakshmi” movie.
Story first published: Thursday, February 26, 2015, 18:35 [IST]