»   » అందుకే అతడితో ప్రేమ విఫలమైంది, పెళ్లి జరిగుంటే విడాకులయ్యేవి: చార్మి

అందుకే అతడితో ప్రేమ విఫలమైంది, పెళ్లి జరిగుంటే విడాకులయ్యేవి: చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Charmi Talks About Her Love Life

ముంబైలో పుట్టి పెరిగిన పంజాబీ బ్యూటీ చార్మి కౌర్.... సినిమాను తనకెరీర్‌గా ఎంచుకుని, తెలుగులో వరుస అవకాశాలు రావడంతో అవిచేస్తూ టాలీవుడ్లో సెటిలయ్యారు. స్టార్ హీరోయిన్ రేంజిక కాక పోయినా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా సక్సెస్‌లు తగ్గడంతో ఫిల్మ్ ప్రొడక్షన్ వైపు రూటు మార్చిన ఆమె పూరితో కలిసి పలు చిత్రాలు నిర్మిస్తూ తెర వెనక తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్, ప్రేమ, పెళ్లి అంశాలకు సంబంధించి పలు ఆస్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

 తెరపై కనిపించడం లేదనే వెలితి లేదు

తెరపై కనిపించడం లేదనే వెలితి లేదు

మీరు చాలా రోజులుగా సినిమాల్లో నటించడం లేదు, ఆ లోటను మీరు ఫీలవ్వడం లేదా? అనే ప్రశ్నకు చార్మి స్పందిస్తూ.... ప్రస్తుతం నేను చేస్తున్న ఫిల్మ్ ప్రొడక్షన్ జాబ్‌తో సంతృప్తిగా ఉన్నాను. ఈ పని ఎందుకు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఒక వేళ మంచి స్క్రిప్టు దొరికితే తప్పకుండా నటిస్తాను అని తెలిపారు.

అతడితో ప్రేమ విఫలమైంది

అతడితో ప్రేమ విఫలమైంది

ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు? ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ఇండస్ట్రికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డమాట నిజమే. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైంది. ఒక వేళ మాకు పెళ్లి జరిగి ఉంటే ఆ రెండు కారణాల వల్ల ఇప్పటికే విడాకులు కూడా తీసుకుని ఉండేవారం అని చార్మి చెప్పుకొచ్చారు.

 అతడు మంచి వాడే, కానీ

అతడు మంచి వాడే, కానీ

అతడు బ్యాడ్ గయ్ అని నేను అనడం లేదు.... అతడు చాలా మంచి వాడు, కానీ నేనే చెడ్డదాన్ని అని చార్మి తనదైన రీతిలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్ షిప్‌కు నేను న్యాయం చేయలేను, అతడికి సమయం కేటాయించలేను అని తెలిపారు.

 నేను చేస్తున్న పనులను ప్రశ్నిస్తే సహించలేను

నేను చేస్తున్న పనులను ప్రశ్నిస్తే సహించలేను

నా జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చి నేను చేస్తున్న పనులను ప్రశ్నిస్తే నేను సహించలేను. ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు స్వతంత్రంగా ఉండటం అంటే ఇష్టం అని చార్మి చెప్పుకొచ్చారు.

పెళ్లి మీద నమ్మకం లేదు, జీవితాంతం ఇలానే

పెళ్లి మీద నమ్మకం లేదు, జీవితాంతం ఇలానే

పెళ్లి చేసుకోవాలని అమ్మ ఎప్పుడూ నాపై ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కానీ పెళ్లిపై నాకు నమ్మకం లేదు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. బ్రతికినంతకాలం ఇలానే మా తల్లిదండ్రులతో ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను అని చార్మి తెలిపారు.

 చార్మి సినిమాలు...

చార్మి సినిమాలు...

జ్యోతి లక్ష్మి, మంత్ర 2 సినిమాల తర్వాత చార్మి పూర్తిగా నటనకు దూరం అయ్యారు. ప్రొడక్షన్ మీదనే పూర్తి ఫోకస్ పెట్టారు. పూరి జగన్నాధ్‌కు చెందిన ‘పూరి కనెక్ట్స్' సంస్థతో కలిసి సహ నిర్మాతగా వ్యవరిస్తూ రోగ్, పైసా వసూల్ చిత్రాలు చేసిన ఆమె ప్రస్తుతం ‘మెహబూబా' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

English summary
Charmi Shocking Revelations About her failed love relation. “I am very happy in my personal and professional life. With Jyothi Lakshmi, I turn a producer and I am looking forward to making this a career too.:" Charmi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X