»   » పాపం..విషాదాన్ని మిగిల్చిన చార్మి సయ్యాట

పాపం..విషాదాన్ని మిగిల్చిన చార్మి సయ్యాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చార్మి టైమ్ ఏమీ బాగున్నట్లు లేదు. ఆమె హీరోయిన్ గా వచ్చిన ప్రతీసినిమా ఒక్క వారం కూడా సరిగ్గా ఆడటం లేదు. తాజాగా ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సయ్యాట చిత్రం ఆమెకు తీవ్ర నిరాశే మిగిల్చింది. నిర్మాతలకైతే పెట్టిన డబ్బుల్లో పావలా వంతు కూడా వెనక్కి రాక విషాదాన్ని అందించింది. ఇక ఈ చిత్రంలో వైజాగ్ కత్తిగా చార్మి ఎప్పటిలాగే బాగా చేసినా కథా సమస్యే సినిమాని నాశనం చేసింది. రియాల్టిషో బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రం అని విపరీతంగా చేసిన రాంగ్ పబ్లిసిటీ చేసిన ఈ చిత్రాన్ని ముంచేసింది. నిజానికి ఈ చిత్రంలో రియాల్టిషో సంభందించి చిన్న ఎపిసోడ్ మాత్రమే ఉంటుంది. అదీ కథకీ సంభందం లేనట్లు ఉంటుంది. రియాల్టిషో పార్టిసిపేంట్స్ కష్టాలుగా ప్రారంభమైన కథ రెండు రౌడీ గ్యాంగులను హతమార్చే ఇతివృత్తంగా ప్రారంభమైన కాస్సేపటికే మారి కిడ్నాప్ డ్రామా తో మెలితిరిగి ఓ ఓల్డ్ ప్లాష్ బ్యాక్ తో క్రైమ్ సబ్జెక్టుగా మారిపోయి కంపరం కలిగించే క్లైమాక్స్ తో ముగుస్తుంది. నీ అందంతో వలవేయ్, మచ్చిక చేసుకో, చంపేయ్ అంటూ చార్మితో విలన్స్ అనటం ఆమె ఒప్పుకోవటం వంటి ఎన్నో విచిత్రాలు ఉంటాయి. ఏదైమైనా చార్మి తిరిగి రీచార్జ్ అవ్వాలంటే మంచి మంత్ర లాంటి హిట్ పడాలి. అది మంగళ చిత్రం తీరుస్తుందో లేక శ్రీకాంత్ తో చేస్తున్న సేవకుడు కొనసాగిస్తుందో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu