»   » కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా: చార్మి

కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా: చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కెరీర్ లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఛార్మి తన లేటెస్ట్ చిత్రం 'సయ్యాట' గురించి చెప్పుకొచ్చింది. అలాగే గతంలో తను నటించిన 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' చిత్రాలను మించి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు కొత్తగా ఉందనీ, ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మాతలు తీశారనీ తెలిపింది. ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె.ఆర్.కె.పవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రం గురించి దర్శకుడు పవన్ మాట్లాడుతూ....కథకు ఎంత ప్రాధాన్యం ఉందో, పాటలకూ అంతే ప్రాధాన్యం ఉందనీ, దేవీశ్రీప్రసాద్ వీనులవిందైన సంగీతాన్ని అందించారనీ తెలిపారు. త్వరలోనే ఆడియో, నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.ఈచిత్రంలో ఛార్మి క్యారెక్టరైజేషన్, కథ, కథనం, సంగీతం, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణలని దర్శకుడు పవన్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, రావు రమేష్, డాక్టర్ శివప్రసాద్, అజయ్, ఆలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, రమాప్రభ, మాస్టర్ భరత్, సుమన్ శెట్టి తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. భాషశ్రీ మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి జె.ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ సమకూర్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu