»   » చిరంజీవి గారితో కోరిక తీరుతుందా..చార్మి

చిరంజీవి గారితో కోరిక తీరుతుందా..చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇక్కడ నాకు తీరని కోరిక కూడా ఒకటుంది. పరిశ్రమలోని పెద్ద హీరోలైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు లాంటి టాప్‌ హీరోలందరి సరసన చేశా. ఒక్క చిరంజీవి గారి పక్కన చేయలేదు. ఆయనతో నటించలేకపోయానే..అనే బాధ ఇప్పటికీ నాలో ఉంది. ఆ కోరిక తీరుతుందో, లేదో...' అంటోంది చార్మి. ఆయన రాజకీయల్లోకి వెళ్ళిపోయి చిత్రాలు చేయననటంతో తనకు ఛాన్స్ తప్పిపోయినట్లుగా ఫీలవుతోంది. ఇక చేతిలో మంగళ తప్ప మరే సినిమాలేని చార్మి శరీరం తగ్గించే పనిలో పడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ...ముఖ్యంగా నా లాంటి హీరోయిన్లకు శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌ గా ఉంటే అంత మంచిది. ఈ మధ్య కాస్తంత లావుచేశానని అందరూ అంటున్నారు. అందుకనే ఇలా సన్నబడ్డా. విచిత్రమేంటంటే...నేను తగ్గడం కూడా ఒక న్యూస్‌ అయిపోయింది. కొంతమందేమో...కరీనాలా జీరో సైజ్‌ ట్రై చేస్తున్నారా?...అని అడుగుతున్నారు. మరికొందరేమో బాలీవుడ్‌ కి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు..వాళ్ల డౌట్‌లు వింటే..నాకు నవ్వొస్తుంటుంది. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే ముందు చెప్పేది వారికే కదా. నేను ఇక్కడ సాధించాల్సింది చాలానే ఉంది అంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu